ఏపీ రాజధాని జిల్లాకు ఆ 'అపకీర్తి'

ఏపీ రాజధాని జిల్లాకు ఆ 'అపకీర్తి'

ఏపీ ప్రతిపాదిత రాజధాని గుంటూరు జిల్లాలో ఉంది. ఒకరకంగా గుంటూరు జిల్లానే ఏపీ రాజధాని నగరంగా చెప్పుకోవాలి. ఏపీ రాజధానిగా ప్రతిపాదిత గుంటూరు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే. రానున్న రోజుల్లో మోస్ట్‌ హ్యాపినింగ్‌ ప్లేస్‌గా చెబుతున్న గుంటూరు జిల్లా  రాజధాని ప్రాంతంపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.

ఒకపక్క ఇలాంటి పరిస్థితి ఉంటే. మరోపక్క గుంటూరు జిల్లా ఒక విషయంలో మాత్రం భారీ అపకీర్తి మూటగట్టుకుంటోంది. ఎయిడ్స్‌కు గురిచేసే హెచ్‌ఐవీ పాజిటివ్‌ కేసుల నమోదులో ఏపీలో గుంటూరు జిల్లానే టాప్‌ పొజిషన్లో ఉండటం ఆందోళన కలిగించే  అంశంగా చెప్పాలి.

ప్రపంచంలోనే అత్యున్నత నగరాల్లో ఒకటిగా చేస్తానని చెబుతున్న రాజధాని ప్రతిపాదిత జిల్లా హెచ్‌ఐవీ పాజిటివ్‌ కేసులు భారీగా నమోదు కావటం.. ఏపీ ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేస్తుందన్న భావన వ్యక్తమవుతోంది.

గుంటూరు జిల్లాలో.. ఏడాదికేడాది హెచ్‌ఐవీ పాజిటివ్‌ కేసులు పెరిగిపోవటం గమనార్హం. ఏపీలోని పదమూడు జిల్లాల్లో .. హెచ్‌ఐవీ పాజిటివ్‌ కేసుల నమోదులో గుంటూరు జిల్లా ప్రధమ స్థానంలో నిలిస్తే.. సెకండ్‌ప్లేస్‌లో తూర్పు గోదావరి జిల్లా నిలిచింది.

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో చూస్తే హైదరాబాద్‌ మొదటి స్థానంలో నిలించింది. రాజధాని ప్రతిపాదిత జిల్లాకు హెచ్‌ఐవీ బెడద ఎక్కువన్నట్లుగా గణాంకాలు నమోదు కావటం  ఏమాత్రం శ్రేయస్కరం కాదని.. ఈ అంశంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తే మంచిదన్న సూచనలు వినిపిస్తున్నాయి. ఏపీ రాజధానిని వరల్డ్‌క్లాస్‌ సిటీగా మారుస్తానని చెబుతున్న నేపథ్యంలో.. హెచ్‌ఐవీ లాంటి తీవ్రమైన అంశాల విషయంలో ప్రభుత్వం మరింత జాగరూకతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు