ఏపీలో ఉప ఎన్నిక డేట్‌ ఫిక్స్‌ అయ్యింది..!

ఏపీలో ఉప ఎన్నిక డేట్‌ ఫిక్స్‌ అయ్యింది..!

తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మరణంతో తప్పనిసరి అయిన ఆ నియోజకవర్గ ఉప ఎన్నిక గురించి ఈసీ ఒక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 13 వ తేదీన తిరుపతి నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుందని ఈసీ క్లారిటీ ఇచ్చింది. ఒకవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వచ్చిన కొంత సేపటికే తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక గురించి కూడా ప్రకటన వచ్చింది.

అంటే మరో నెల రోజులకు తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతాయనమాట. మరి ఈ విషయం గురించి ఎన్నికల కమిషన్‌ క్లారిటీ ఇచ్చేయగా.. ఇప్పుడు ప్రధాన పార్టీలు  అంశం గురించి స్పందించాల్సిన అవసరం ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే మరణించడంతో వస్తున్న ఈ ఎన్నికల్లో ఆయన భార్యను పోటీ చేయించాలని తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. తద్వారా ఏకగ్రీవ విజయాన్ని సాధించాలని టీడీపీ అధినేత దాదాపు ఒక అభిప్రాయానికి వచ్చింది. మరి ఈ విషయంలో మిగతా పార్టీలు ఎలా స్పందిస్తాయో..!

వైకాపా అయితే సానుకూలంగా స్పందించే అవకాశాలే ఎక్కువ. ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు టీడీపీ సహకరించినందున ఇప్పుడు ఆ పార్టీ టీడీపీకి సహకరించవచ్చు. కాంగ్రెస్‌ కథేంటో!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు