గమనించారా; ఆ రెండు ఫంక్షన్లకు బాబు వెళ్లలేదు

గమనించారా; ఆ రెండు ఫంక్షన్లకు బాబు వెళ్లలేదు

ఆదివారం ఏపీలో రెండు కార్యక్రమాలు జరిగాయి. ఈ రెండు కార్యక్రమాలు నెల్లూరు జిల్లాలోనే జరిగాయి. అందులో ఒకటి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి నేతృత్వంలో.. ఆయన సొంత సంస్థ అయినా స్వర్ణభారతి ట్రస్ట్‌ సంక్రాంతి పండుగ అయితే.. మరొకటి ఏపీ సర్కారు నిర్వహిస్తున్న పక్షుల పండుగ.

సెలవురోజున నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎక్కడో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ వచ్చారు. ఫంక్షన్లకు పెద్దగా హాజరు కాని పవన్‌ కల్యాణ్‌ వచ్చారు. కానీ.. టీడీపీ నేతలే కాదు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కాలేదు. సరే.. అది వెంకయ్యనాయుడి సొంత యవ్వారం కదా అని సరిపెట్టుకోవచ్చు.

మరోవైపు.. ఏపీ సర్కారు నేతృత్వంలో నెల్లూరు జిల్లాలోనే పక్షుల పండుగ నిర్వహించారు. దీనికి ఏపీకి చెందిన పలువురు మంత్రులు హాజరయ్యారు. కానీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం హాజరు కాలేదు. ఒక జిల్లాలో రెండు ముఖ్యమైన కార్యక్రమాలు జరుగుతుంటే ఏపీ ముఖ్యమంత్రిగా బాబు హాజరు తప్పనిసరిగా ఉండాల్సింది.

కానీ.. అలాంటివేమీ చోటు చేసుకోలేదు. మరోవైపు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కాలేదు కానీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం వెంకయ్య కార్యక్రమానికి హాజరయ్యారు. దీన్ని చూస్తే వెంకయ్య ప్రోగ్రామ్‌కి చంద్రబాబుకు ఇన్విటేషన్‌ లేదా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. వెంకయ్య ఇన్విటేషన్‌ లేని కారణంగానే.. అదే జిల్లాలో జరిగిన పక్షుల పండుగ కార్యక్రమానికి వెళ్లకుండా హైదరాబాద్‌లోనే ఉండిపోయారన్న మాట వినిపిస్తోంది.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు