పవన్‌ చీపురు పట్టుకోనట్లే

పవన్‌ చీపురు పట్టుకోనట్లే

స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా వారు.. వీరు అన్న తేడా లేకుండా పెద్దపెద్ద సెలబ్రిటీలు సైతం చీపుర్లు పట్టుకొని బజార్లోకి వచ్చి కాసేపు శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నారు.

స్వచ్ఛభారత్‌ను ఏదో నాలుగు రోజుల హడావుడి చేసే కార్యక్రమం మాదిరి కాకుండా.. ఒక క్రమపద్ధతిలో దాన్ని ప్రమోట్‌ చేస్తున్న విషయం తెలిసింది. ఈ కార్యక్రమం కోసం ప్రముఖుల్ని నామినేట్‌ చేయటం.. వారు స్వచ్ఛభారత్‌పై ప్రచారం చేయటం తెలిసిందే.

ఈ మధ్యనే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలుగురాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులను ఈ కార్యక్రమం కోసం నామినేట్‌ చేశారు. అందులో పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ఒకరు. మిగిలిన వారికి భిన్నంగా ట్రెండ్‌నిసెట్‌ చేసే పవన్‌.. స్వచ్ఛభారత్‌ వ్యవహారంలో చీపురు పట్టుకునేటట్లు కనిపించటం లేదు.

ఒకవేళ పట్టుకున్న గుట్టుగా చేస్తారే తప్పించి.. చీపురు పట్టుకున్న ఫోటోలు బయటకు వచ్చే పరిస్థితి లేదంటున్నారు. పవనే స్వయంగా స్వచ్ఛభారత్‌ అంటే ఫోటోలు అచ్చేయించుకోవటం కంటే కూడా పరిసరాలు శుభ్రంగా ఉండాలన్న స్పృహతో ఉండాలంటూ కొత్త వాదనను వినిపించటం తెలిసిందే. ఫోటోల కోసం కాకుండా ఎవరికి వారు వ్యక్తిగతంగా స్వచ్ఛభారత్‌ను చేపట్టాలని చెబుతున్న నేపథ్యంలో.. పవన్‌ చీపురు పట్టుకునే ఫోటో కనిపించే అవకాశం ఉండదనే అంటున్నారు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు