చంద్రబాబును నిలదీసినందుకు ఇల్లు

చంద్రబాబును నిలదీసినందుకు ఇల్లు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును నిలదీసినందుకు ఓ వ్యక్తికి సొంతిల్లు దొరికింది. గతంలో ఓసారి తెలంగాణపై మీ వైఖరి ఏంటో స్పష్టంగా చెప్పాలంటూ నిలదీసిన వరంగల్‌ జిల్లాకు చెందిన ఫణికర మల్లయ్య నిలదీసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన పంట పండింది. వరంగల్‌ జిల్లా పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ మల్లయ్య ఘనతను గుర్తించి ఏకంగా ఇల్లుమంజూరు చేశారు. అంతేకాదు, మల్లయ్య ఇద్దరు కూతుళ్లకు ఒక్కొక్కరికి రూ.5 లక్షణ ఆర్థిక సాయం కూడా ప్రకటించారు.

వరంగల్‌ పర్యటనలో ఉన్న కేసీఆర్‌ టీఆరెస్‌ నేత కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు ఇంట్లో బసచేశారు. మల్లయ్యను అక్కడకు పిలిపించి ఆయనతో మాట్లాడారు. మల్లయ్య పిల్లల చదువులు, ఆయన ఆర్థిక పరిస్థితి గురించి ఆరా తీసి వరాలు కురిపించారు. 2008లో పాదయాత్ర చేసిన చంద్రబాబు పొలంలో పనిచేసుకుంటున్న మల్లయ్య వద్దకు వెళ్లి మాట్లాడి నీకేం కావాలి అని అడగగా నాకు తెలంగాణ కావాలి అని చెప్పి మల్లయ్య దేశం దృష్టిని ఆకర్షించారు. ఇప్పడు రాష్ట్రంలో అదికారంలోకి వచ్చిన తరువాత మల్లయ్య లాంటి నిష్కల్మష తెలంగాణ స్వాప్నికుడికి న్యాయం చేయాలని భావించిన కేసీఆర్‌ ఆయనపై వరాలు కురిపించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు