వెంకయ్య సంక్రాంతి అలాగే ఉంటుంది..

వెంకయ్య సంక్రాంతి అలాగే ఉంటుంది..

కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ వెంకయ్యనాయుడు ఏం చేసినా ఘనంగా చేస్తారని పేరు. ఆయనకు జాతీయ స్థాయిలో ఉన్న పరిచయాలు, లాబీయింగ్ అందరికీ తెలిసిందే. తాజాగా ఆయన నెల్లూరు జిల్లాలో తన స్వర్ణభారతి ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబంరాలకు సరికొత్త ఊపు తెచ్చారు. ఈ ఉత్సవాల్లో హాజరైన ప్రముఖులను ఎంచుకోవడంలోనే ఆయన డిఫరెంటుగా ఆలోచించి సంబరాలకు జనం ఎగబడేలా చేయగలిగారు. స్వర్ణభారతి ట్రస్టు సంక్రాంతి సంబరాలకు ప్రముఖ సినీ హీరో పవన్ కల్యాణ్, మహారాష్ట్ర సీఎం దేవంద్ర ఫడణవిస్ ను తీసుకొచ్చి అందరినీ అట్రాక్ట్ చేయగలిగారు. అంతేకాదు ఫడ్నవిస్ ఫ్యూచర్ మోడీ అన్నట్లుగా నర్మగర్భంగా సంకేతాలిచ్చారు. పవన్ ను బీజేపీకి ఏపీలో చుక్కాని అన్నంతగా ప్రమోట్ చేశారు.

దేశంలోనే అత్యంత పిన్న వయసు సీఎంగా పేరున్న మహా ముదురు దేవంద్ర ఫడణవిస్.. రాజకీయాల్లో పూర్తిగా మమేకమవకుండానే ఏపీలో ఫలితాలను తారుమారు చేసి, తనకున్న ప్రజాదరణను రాజకీయ నేతలకు యాడెడ్ ఫ్లేవర్ గా మలిచి అధికారం అప్పగించిన ఘటికుడు పవన్ కల్యాణ్ ను సంక్రాంతి సంబరాలకు తీసుకొచ్చి బీజేపీకి, వెంకయ్యకు తిరుగులేని మైలేజి తెచ్చేశారు.

సంబరాల సందర్భంగా వెంకయ్య... పవన్, ఫడ్నవిస్ ను పొగిడిపొగిడి వదిలిపెట్టారు. ఫడ్నవిస్ దేశంలో భవిష్యత్ ధ్రువతార అన్న నమ్మకం తనకుందని చెప్పి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఫడ్నవిస్ మరో మోడీ అన్నంతగా బిల్డప్ ఇచ్చారు.  వపన్ ను కూడా బీజేపీకి అత్యంత నమ్మకమైన, కీలకమైన సెలబ్రిటీ రాజకీయ స్టార్ గా అభివర్ణించి ఆయన అభిమానులను కట్టిపడేశారు. పవన్ కు ఆయన ఇచ్చిన ప్రాధాన్యం చూసినవారు భవిష్యత్ లో బీజేపీలో పవన్ స్థాయి ఏంటో, ఆయన ఎంత కీలకమవుతారో అన్నది అర్ధం చేసుకుంటున్నారు. సంక్రాంతులు, సంబరాలు ఎలా ఉన్నా కూడా బీజేపీ భవిష్యత్ వ్యూహమేంటనేది,, ఏపీని ఎలా కమ్మేయాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తుందో కూడా టీడీపీ వర్గాలు అర్థం చేసుకుని కక్కలేక మింగలేక ఉంటున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు