జూనియర్ ఆ పార్టీలో సీనియరే..

జూనియర్ ఆ పార్టీలో సీనియరే..

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తన బాబాయి బాలకృష్ణతో అంతంతమాత్రంగా సంబంధాలున్న జూనియర్ ఎన్టీఆర్ టీడీపీతో సంబంధాలను మాత్రం బ్రహ్మాండంగా కొనసాగిస్తున్నారు. అమెరికా సైన్యాన్ని మించిపోయిన తెదేపా సైన్యంలో తాను కూడా జవానునేనంటూ ఆయన టీడీపీ సభ్యత్వాన్ని పునరుధ్దరించుకున్నారు. అయితే, అంతా రహస్యంగా, ఎక్కడా విషయం బయటకు పొక్కకుండా చాలా జాగ్రత్త పడ్డారు. మరి ఈ గేమ్ ప్లాన్ ఎందుకో గానీ చిన్న ఎన్టీఆర్ మాత్రం మూడో కంటికి తెలియకండా టీడీపీ సైన్యంలో తన చోటును మళ్లీ సంపాదించుకున్నారు.

ప్రముఖ నటుడు జూనియర్ ఎన్.టి.ఆర్. రహస్యంగా తెలుగుదేశం సభ్యత్వం పునరుద్దరించుకోవడం విశేషంగా ఉంది. సాధారణంగా సినీ రంగంలోనో, లేక రాజకీయ రంగంలోనో ప్రముఖ స్థానంలో ఉన్న వారు మీడియాకు చెప్పో, లేక పార్టీ అబిమానుల మధ్యో దానిని ఒక కార్యక్రమంగా నిర్వహిస్తుంటారు.అలాంటిది జూనియర్ ఎన్.టి.ఆర్. కామ్ గా కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో భాగంగా ఉన్న నిమ్మకూరు వద్ద టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. అయితే, ఇంతకాలం అంటీముట్టనట్లుగాఈ ఉన్న సంబంధాలను మళ్లీ పునరుద్ధించుకోవడానికి ఆయన ఎందుకు తాపత్రయపడుతున్నారన్నది కోటి డాలర్ల ప్రశ్నగా మారింది. టీడీపీలో తనకు ప్రాధాన్యం ఇవ్వడంలేదన్న బాధతో ఉన్న ఆయన కాస్త మెత్తబడినట్లు సమాచారం. తన సినీ జీవితానికి ఇబ్బంది రాకుండా ఉండడానికి, వచ్చే కొత్త సినిమా కు తలనొప్పి లేకుండా ఉండడానికి గాను ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ప్రధానంగా తన అబిమానులలో ఉన్న ఒక ప్రధాన సామాజికవర్గాన్ని దూరం చేసుకోవడం ఇష్టం లేక ఇలా చేశారని అంటున్నారు.హైదరాబాద్ లో అయితే పార్టీ ఆఫీస్ కు వెళ్లవలసి రావచ్చు. అలాకాకుండా నిమ్మకూరు అయితే ఏ గొడవ ఉండదని ఆయన బావించి ఉండవచ్చని చెబుతున్నారు.అయితే ప్రాణం ఉన్నంతవరకు టీడీపీలోనే గతంలో జూనియర్ చెప్పారని ,ఆయన అబిమానులు గుర్తుచేస్తున్నారు. మొత్తానికి కెరీర్ పరంగా కాస్త ఒడిదుడుకుల్లో ఉన్న జూనియర్ టీడీపీ సపోర్టు, బాబాయి బాలకృష్ణ, మామయ్య చంద్రబాబు అండదండలు లేకుంటే కెరీర్ కు కూడా ఇబ్బందులు వస్తాయని భావించి తానే ఒక మెట్టు దిగినట్లుగా చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు