కేసీఆర్ మార్కులు కొట్టేస్తున్నారు..

కేసీఆర్ మార్కులు కొట్టేస్తున్నారు..

కేసీఆర్ మామూలు మొండోడు కాదు... ఏదైనా అనుకున్నడంటే అది చేసే దాక నిద్ర పట్టడు.. పట్టుబట్టి తెలంగాణ సాధించలేదా... మీకు తెల్వదా... ఇయ్యాల వరంగల్ లో పేదల బతుకుల్ని జూసిండు... మీరు ఎవ్వలికైనా రూపాయి లంచమిస్తే మిమ్మల్ని పొట్టుపొట్టు కొడతా.. సంపుతా బిడ్డా... ఇయ్యాల గవర్నమెంటు అధికారులందరికీ జీతాలిస్తుంది,  దొంగలు, పైరవి కారులకు పైసలిచ్చిండ్రంటే ముందుగాల మీకు తోలుదీస్త... ఎందుకియ్యాల, గవర్నమెంటు పైసలియ్యడం లేదా వారికి.... ఎవ్వరికి ఇయ్యొద్దు... ఎవ్వడైనా పైసలిడిగితే టీఆరెస్ ఆఫీసుల కాల్ సెంటరుకు ఫోన్ జెయ్యండ్రి... కేసీఆర్ కు కంప్లయంటు జేయండ్రి... ఆళ్ల పని పడతా...అని కేసీఆర్ వరంగల్ ప్రజలకు భరోసా ఇచ్చారు. ఆయన నోటి నుంచి ఈ మాటలు వినపడగానే విజిళ్లు, కేకలు ఒకటేమిటి... జనం బ్రహ్మరథం పట్టారు.

వరంగల్ పర్యటనలో నాలుగో రోజు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలను ఉర్రూతలూగించారు. మామూలుగానే ఆకట్టుకునే ప్రసంగాలు చేసే కేసీఆర్ వరంగల్ లో ఈసారి ప్రజలకు నచ్చేలా, వారు మెచ్చేలా మాట్లాడి ఆకట్టుకున్నారు. ఎవరైనా లంచం అడిగే 040- 23454071నంబరుకు ఫోన్ చేయమని చెప్పి మీ వెంట నేనున్నాననే భరోసా ఇచ్చారు.  వరంగల్ ను అద్దంలా మారుస్తామని ముఖ్యమంత్రి మాట ఇచ్చారు. 3957 మందికి ఇళ్లు కట్టించి ఇస్తానంటూ వరం కురిపించారు. వరంగల్ ను అద్దంలా చేస్తానని...తాను తొమ్మిది బస్తీల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నానని... వరంగల్ జిల్లాలో నాలుగు నెలల్లో పేదరికం అన్నది కనపకుండా చేస్తానని మాట ఇచ్చారు. మొత్తానికి సారుకు రూట్ లెవల్ కు వెళ్లకపోతే ముందుముందు కష్టమన్న సంగతి బాగా అర్థమైనట్లుంది. అందుకే నెపమంతా అధికారులపై నెడుతూ సర్కారు శుద్ధ పూస అన్నట్లుగా కలరిస్తూ మార్కులు కొట్టేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు