మెగా ప్రచారం ఉపయోగపడేనా?

మెగా ప్రచారం ఉపయోగపడేనా?

కర్నాటకలో కాంగ్రెసు పార్టీ చిరంజీవిని ప్రచార రంగంలోకి దించింది. చిరంజీవికి కర్నాటకలో పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు కాబట్టే కాంగ్రెస్‌ ఈ వ్యూహాన్ని అమలు చేసింది. కాని గత ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కి చేదు అనుభవాన్నే మిగిల్చాయి చిరంజీవిని ప్రచారంలో దించినప్పటికినీ. కడప, పులివెందుల ఉప ఎన్నికలే కావొచ్చు, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలే కావొచ్చు, చిరు ప్రచారం కాంగ్రెస్‌కి లాభించినదేమీ లేదు. కాని అప్పుడంటే చిరంజీవికి పదవి లేదు. ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి ఉంది.

చిరంజీవి ప్రచారానికి వచ్చాడన్నదానికీ కేంద్ర మంత్రి చిరంజీవి ప్రచారానికి వచ్చాడన్నదానికీ చాలా తేడా ఉంటుందని కాంగ్రెసు పార్టీ నమ్ముతున్నది. ఆ నమ్మకం ఏమవుతుందోగాని చిరంజీవిని రంగంలోకి దించి మంచి పనే చేశామని కాంగ్రెసు భావించేలా అతన్ని చూసేందుకు జనం పోటీ పడుతున్నారట కర్నాటకలో. వచ్చినవారంతా ఓట్లేస్తారా? వేస్తే చిరంజీవి రాజకీయంగా ఎదిగినట్టే అవుతుంది.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు