వైఎస్సార్ కాంగ్రెస్ కు దెబ్బ మీద దెబ్బ

వైఎస్సార్ కాంగ్రెస్ కు దెబ్బ మీద దెబ్బ

ఈ మధ్య వైఎస్సార్ కాంగ్రెస్ నేతలకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఒకపక్క అధినేత జైలు నుంచి ఎప్పటికి వస్తారో తెలీకపోవటం.. వైఎస్ జమానాలో జరిగిన తప్పులు మరికొన్ని బయటకు రావటం లాంటి వాటితో సతమతమవుతున్న ఆ పార్టీకి ఇప్పుడు తాజాగా.. ఆ పార్టీకి చెందిన నేతలు వేరే పార్టీల్లోకి వెళ్లిపోవటం వారిని తీవ్రంగా కలిచి వేస్తుంది. నిన్నటివరకు ఏదైతే బలం అనుకున్నారో ఇప్పుడు అదే బలహీనతగా మారి.. వారిని ఇబ్బంది పెడుతుంది. ఇతర పార్టీ నేతల్ని ఆకర్షించి తమ పార్టీలోకి తెచ్చుకోవటం వరకు బాగానే ఉన్నా.. వారిని నిలుపుకునే విషయంలో మాత్రం పార్టీ వెనుకబడి ఉంటోంది.

మొన్నటిమొన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు పలువురు పార్టీని విడిచి వెళ్లిపోతే.. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత మాకినేని పెదరత్తయ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక.. ఖమ్మం జిల్లాలో పట్టు ఉన్న నేతగా పేరొందిన స్వర్గీయ జలగం వెంగళరావు కుమారుడు జలగం వెంకటరావు పార్టీని విడిచిపెట్టే యోచనలో ఉన్నారు. వీరు ఇరువురు పార్టీ నుంచి వెళ్లిపోవటానికి కారణం.. మొదట ఇచ్చినట్లుగా వ్యవహరించకపోవటం.. తమకు పోటీ నేతల్ని పార్టీలోకి తీసుకురావటంగా చెబుతున్నారు. ఈ మధ్యనే దాడి వీరభద్రరావు విషయంలోనూ కొణతాల రామకృష్ణ ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు