బిజెపికి నాగం టెన్షను

బిజెపికి నాగం టెన్షను

నాగం జనార్ధన్‌రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరడానికే నిర్ణయించుకున్నారు. బిజెపిలో చేరతానని ఇప్పటికే చెప్పిన నాగం జనార్ధన్‌రెడ్డి, మంచి ముహూర్తం ఇంకా నిర్ణయించుకోలేదు. రాజకీయాలలో ఎవరి మనసైనా ఎప్పుడైనా మారిపోవచ్చును. ఆ విషయం బిజెపి నేతలక కూడా బాగా తెలుసు. అందుకే నాగం జనార్ధన్‌రెడ్డి మనసు మారకుండా ఉంటుందా? అన్న అనుమానం ఆ పార్టీలో వ్యక్తమవుతున్నది.

తెలుగుదేశం పార్టీని వీడిన తరువాత నాగం జనార్ధన్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరతారని కొందరు భావించారు. కానీ అది జరుగలేదు. బిజెపితో ఉద్యమ స్నేహం నడుపుతూ, ఇంతకాలానికి బిజెపిలో చేరాలని నిర్ణయం ప్రకటించారు నాగం జనార్ధన్‌రెడ్డి. ఆ ఒక్క ముచ్చట పూర్తి చేసి, బిజెపి నేతగా నాగం మారేదాకా బిజెపి అగ్రనాయకత్వానికి టెన్షను తప్పదు. చల్లకొచ్చి ముంతదాయడమంటే ఇదే. నాగం జనార్ధన్‌రెడ్డికి ముహూర్తం ఎందుకు దొరకడంలేదో తెలియరావడంలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English