రామలింగరాజుకు జైలుశిక్ష ఖరారు చేశారు

రామలింగరాజుకు జైలుశిక్ష ఖరారు చేశారు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్యం రామలింగరాజుకు సంబంధించిన ఆర్థిక నేరాలకు ఆయన్ను దోషిగా తేల్చారు. 2009లో బయటకొచ్చిన.. ఆ మాటకు వస్తే.. తనకు తానుగా తప్పు చేశానని ఒప్పుకొని బయటకొచ్చిన సత్యం రామలింగరాజుపై ఆర్థిక నేరాలను నమోదు చేయటం తెలిసిందే.

దేశ ఐటీ రంగాన్ని ఓ పెద్ద కుదుపు కుదిపిన ఈ అంశానికి సంబంధించి ఆరు కేసులకు సంబంధించి ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు తీర్పును వెలువరించింది. సత్యం స్కాంలో రామలింగరాజును దోషిగా నిర్ధారించింది. ఐటీ రంగాన్ని తీవ్రంగా కదిలించిన ఈ వ్యవహారంలో 147కోట్ల డాలర్ల మేర కుంభకోణం జరిగిందన్న వాదన ఉంది.

మొత్తం ఆరు కేసుల్లో మూడు కేసుల్లో రూ.10లక్షల జరిమానా విధించారు. మరో నాలుగు కేసులకు సంబంధించి ఒక్కో కేసుకు ఆర్నెల్లు చొప్పున మొత్తం 24 నెలల జైలుశిక్షను విధించారు. రామలింగరాజుతో పాటు.. రామ్‌ మైనంపాటికి కూడా రూ.10లక్షల జరిమానాను విధించారు. మరో కేసును కోర్టు కొట్టివేసింది.

అంతేకాదు.. తీర్పుపై అప్పీలు చేసుకునేందుకు ఆర్తిక నేరాల ప్రత్యేక కోర్టు మూడు నెలల పాటు గడువు ఇచ్చింది. సత్యం రామలింగరాజుతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురికి రూ.20వేల చొప్పున జరిమానా విధించింది. గతంలో రామలింగరాజు సుదీర్ఘకాలం పాటు జైలులో ఉన్న నేపథ్యంలో.. తాజాగా కోర్టు విధించిన 24 నెలల కాలాన్ని ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటారు? ఆయనింకా ఎంత కాలం జైలుశిక్ష అనుభవించాల్సి ఉందన్న విషయంపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English