ఎవరి గోల వారిది

ఎవరి గోల వారిది

ప్రజలను పరిపాలించడానికి ప్రభుత్వం ఉండాలి. ఆ ప్రభుత్వాన్ని నడిపేది అధికారంలో ఉండే పార్టీ. ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ప్రజల కోసం పనిచేయాల్సి ఉంటుంది. కాని జరుగుతున్నది అది కాదు. మంత్రులు గ్రూపులుగా విడిపోయి తమ తమ నాయకుల జపం చేయడంతోనే వారికి కాలక్షేపం అవుతోన్నది. కిరణ్‌ వర్గం, చిరంజీవి వర్గం, బొత్స వర్గంగా మంత్రులు మారిపోయారు. సందర్భాన్ని బట్టి ఒక వర్గంతో ఇంకో వర్గం జతకట్టడం లేదంటే ఒక వర్గంపై ఇంకో వర్గం విమర్శలు చేసుకోవడం మామూలైపోయింది.

చిరంజీవే ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారని రామచంద్రయ్య అంటే, సీనియర్‌ నాయకుడు అయి ఉండి అలాంటి మాటలు తగవంటారు కొండ్రు మురళి. రామచంద్రయ్య - చిరంజీవి మనిషి. కొండ్రు మురళికి సీఎం కిరణ్‌ ఆశీస్సులున్నాయి. ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, డిఎల్‌ రవీంద్రారెడ్డి లాంటివారు బొత్సతో టచ్‌లో ఉంటారు. తెలంగాణ గ్రూపు కూడా ఉందిక్కడ. ఇలా మంత్రులు గ్రూపులుగా విడిపోతే, పాలన ఎలా సాగుతుంది? ముఖ్యమంత్రి ఏదన్నా పధకం తెస్తే, కాంగ్రెసు పార్టీ వారే విమర్శలు చేస్తారు. ఎవరిగోల వారిది, ప్రజల గోలే ఎవరికీ పట్టడంలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English