రామ్‍ ఉడుం పట్టు పట్టేసాడు

రామ్‍కి స్టార్‍గా నెక్స్ట్‍ లెవల్‍కి వెళ్లే అవకాశాలు చాలాసార్లు వచ్చాయి. అయితే కథల ఎంపికలో పొరపాట్లు చేసి తనకున్న అడ్వాంటేజీని చేజేతులా పోగొట్టేసుకున్నాడు. దాదాపు మూడు, నాలుగు సార్లు రామ్‍ అలా పొరపాట్లు చేసాడు. అందుకే ఈసారి మాత్రం తప్పటడుగు వేసేదే లేదంటూ ఉడుం పట్టు పట్టేసాడు. ఇస్మార్ట్ శంకర్‍ తర్వాత ఏ సినిమా చేస్తే రైట్‍ అని చాలా ఆలోచించి ‘రెడ్‍’ చిత్రాన్ని ఓకే చేసాడు. ఈ చిత్రం తన ఇస్మార్ట్ శంకర్‍ మాస్‍ ఇమేజ్‍కి కొనసాగింపు అవుతుందని రామ్‍ నమ్మకం.

అయితే దీని తర్వాత ఏమిటనేది రామ్‍కి ఐడియా లేదు. ఈ లాక్‍డౌన్‍లో దాదాపు డజను కథలు విని రిజెక్ట్ చేసాడట. సక్సెస్‍ఫుల్‍ డైరెక్టర్లకు కూడా నిర్మొహమాటంగా నో చెప్పేసాడట. తనకు ఖచ్చితంగా బ్లాక్‍బస్టర్‍ అనే నమ్మకం కలిగించే కథ దొరికే వరకు వేచి చూడాలనే ఫిక్స్ అయ్యాడట. ఎలాగో తదుపరి చిత్రానికి టైమ్‍ పడుతుంది కనుక రెడ్‍ సినిమాను ఓటిటిలో రిలీజ్‍ చేయనక్కరలేదని, థియేటర్లు ఎప్పటికి తెరిస్తే అప్పుడే రిలీజ్‍ చేయవచ్చునని రామ్‍ డిసైడ్‍ అయిపోయాడంటే తన కెరియర్‍ పరంగా ఇప్పుడతను ఎంత ఫోకస్డ్ గా, ఇంకెంత స్ట్రిక్ట్ గా వుంటున్నాడనేది అర్థమవడం లేదూ?