కడియం శ్రీహరి చిలకపలుకులు

కడియం శ్రీహరి చిలకపలుకులు

చిలక అంటేనే మాటలు నేర్చి పలికేది. స్వబుద్ధితో పలికేది కాదు. అయితే తెరాసలో చేరిన కడియం శ్రీహరి పరిస్థితి కూడా యజమాని నేర్పిన మాటలను వల్లె వేయాల్సిన చిలక పరిస్థితి లాగానే తయారైంది ఇప్పుడు. కేసీఆర్‌ బహిరంగంగా నోరు మెదపక పోయినా.. అంతరంగిక సమావేశల్లో ఆయన తనకు నేర్పిన మాటలను కడియం శ్రీహరి ఇప్పుడు బయటకు వచ్చి తన నోటితో పలకాల్సి వస్తోంది. కడియం శ్రీహరి ఏదో తెలంగాణ రాష్ట్రం సాధించేయడానికి తెరాస ఒక్కటే మార్గం అన్నట్లుగా భ్రమపడి వెళ్లారేమోగానీ.. ఆ పార్టీలో నేతల దందాలకు కాపలాకాయడం.. వారు తప్పులు చేస్తే తాను సమర్థిస్తూ స్టేట్‌మెంట్లు ఇవ్వడం ఇదే ఆయన పనిగా మారుతోంది ఇప్పుడు.

తాజాగా ఆయన మాట్లాడుతూ కేటీఆర్‌ కిడ్నాపులు, అక్రమ వసూళ్ల బాగోతాలపై పోరాడుతున్న తెలుగుదేశాన్ని ఈ విషయంపై ఇంత రాద్ధాంతం చేస్తున్న మీరు... చిత్తశుద్ధి ఉంటే.. తెలంగాణపై  అసెంబ్లీలో ఒక్కసారైనా వాయిదా తీర్మానం ఇచ్చారా అంటూ ప్రశ్నించడం చాలా వింతగా ఉంది. కేసీఆర్‌ నాయకత్వంపై నమ్మకం లేనివాళ్లు స్వతంత్రంగా రాష్ట్రంకోసం పోరాడాలే తప్ప.. ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేయడం తప్పు అంటూ కడియం అనడం విస్మయం కలిగిస్తోంది.ఈ మాటల ద్వారా కడియం శ్రీహరి అసలు ఏం చెప్పదలచుకున్నారు.

 రాష్ట్రం కోసం వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారని, లేదా, చేయడం లేదని అనుకుందాం. దానికి కేటీఆర్‌ అక్రమాలను వేలెత్తిచూపడానికి సంబంధం ఏంటి? తెలంగాణ ఉద్యమంతో నిమిత్తం లేనివారు కూడా.. అంటే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు కూడా కేటీఆర్‌ వసూళ్ల బాగోతాన్ని చర్చకు తేవొచ్చు కదా.. ఆ హక్కు అందరికీ ఉంటుంది. అయితే.. తాము తెలంగాణకు కాపలా కుక్కలం అని చెప్పుకునే తెరాస తీర్థం పుచ్చుకున్న తర్వాత.. సీనియర్‌ నాయకుడు అయిన కడియం శ్రీహరి.. కేసీఆర్‌ ఇంటికి కాపలా ఉంటున్నట్లుగా కనిపిస్తోంది... ఈ వ్యవహారాన్ని విమర్శలను గమనిస్తోంటే!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English