సైనికులు తర్వాత సైన్యాధ్యక్షుల మాటేమిటో..?

సైనికులు తర్వాత సైన్యాధ్యక్షుల మాటేమిటో..?

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఏమిటో ఈ రోజు అందరికి తెలిసిందే. సరైన నాయకత్వం లేక కిందామీదా పడిపోవటం.. అసెంబ్లీలో సైతం అధికారపక్షాన్ని ఇబ్బంది పెట్టలేక వారు పడుతున్న అవస్థలు అన్నిఇన్ని కావు.

ఇదిలా ఉంటే.. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ కోసం అంకితభావంతో పని చేసేందుకు ఐదు వేల మంది దళిత సైనికుల్ని తయారు చేస్తున్నట్లు తెలంగాణ పీసీసీ చీఫ్‌ పొన్నాల చెబుతున్నారు. కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణా తరగతుల ద్వారా పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేస్తామని చెప్పుకొచ్చారు.

తెలంగాణలోని ప్రతి మండలంలో పది మంది దళితులను ఎంపిక చేసి.. వారిని విశాల భావాలు కలిగిన వారిగా తీర్చిదిద్దుతున్నామని ఆయన చెప్పారు. శిక్షణ.. లక్ష్యం లాంటివన్ని చెబుతున్న పొన్నాల.. ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతున్నారు. ఐదు వేల మంది సైనికులను తయారు చేస్తున్నామన్న పొన్నాల.. మరి ఆ సైన్యానికి సారథ్యం వహించే సైన్యాధ్యక్షుడి సంగతేమిటి? సరైన సైన్యాధ్యక్షుడు లేకుంటే.. ఎంతమంది సుశిక్షితులైన సైన్యం ఉంటే ప్రయోజనం ఏమిటి..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు