ఒకటి కాదు లీటరకు రూ.2 తగ్గనుంది

ఒకటి కాదు లీటరకు రూ.2 తగ్గనుంది

అశేష ప్రజానీకానికి ఒక శుభవార్త. ఈసారి అలాంటి ఇలాంటి కాదు. పెద్ద లడ్డూ లాంటి వార్తనేనని చెప్పాలి. ఎందుకంటే.. ప్రధాని మోడీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏడుసార్లు తగ్గిన చమురు ధరలు.. తాజాగా మరోసారి ధరలు తగ్గనున్నాయి.

అది కూడా.. ఎప్పటి మాదిరి అర్థరూపాయి.. రూపాయి.. రూపాయిన్నర కాకుండా ఏకంగా లీటరుకు రూ.2 మేర తగ్గనుంది. ఈ దిశగా నిర్ణయం తీసుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రతి నెల చివరి వారంలో అంతర్జాతీయంగా చమురుధరలపై సమీక్ష నిర్వహించి ధరలు పెంచాలా.. తగ్గించాలా? అన్న అంశంపై నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.

తాజాగా.. అంతర్జాతీయంగా ధరలు భారీగా పడిపోతున్న నేపథ్యంలో లీటరు పెట్రోల్‌కు రూ.2 వరకు తగ్గించ వచ్చని చెబుతున్నారు. ఈసారి డీజిల్‌ ధర కూడా తగ్గించే అవకాశం ఉందని చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు