మీరు మర్చిపోయిన పని మేం పూర్తి చేశామంతే

మీరు మర్చిపోయిన పని మేం పూర్తి చేశామంతే

గాంధీ కుటుంబం మీద తమకున్న విధేయతను ప్రదర్శించుకోవటానికి వచ్చిన అవకాశాన్ని వదులుకోవటానికి ఏ మాత్రం ఇష్టం లేని కాంగ్రెస్‌ నేతలు ఏ రేంజ్‌లో కిందామీదా పడుతున్నారో తెలిసిందే.

గత రెండురోజులుగా పార్లమెంటులో రచ్చ రచ్చ చేసిన కాంగ్రెస్‌ ఎంపీలకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ చురకలు అంటించారు. హైదరాబాద్‌ శంషాబాద్‌ దేశీయ విభాగానికి ఎన్టీఆర్‌ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ నేతలు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ పేరు మార్చినట్లుగా వ్యాఖ్యానించటం తెలిసిందే.

ఈ వ్యవహారాన్ని ప్రశ్నించిన నిర్మాలా సీతారామన్‌.. కాంగ్రెస్‌ నేతలు ఏం చేస్తున్నారో ఒకసారి పరిశీలించుకోవాలని సూచించారు. శంషాబాద్‌ డొమెస్టిక్‌ ఎయిర్‌పోర్ట్‌కి మాత్రమే పేరు మార్చటం జరిగిందని.. ఇంటర్నేషనల్‌ టెర్మినల్‌కు రాజీవ్‌గాంధీ పేరునే ఉంచినప్పటికీ.. మొత్తం ఎయిర్‌పోర్ట్‌కి పేరు మార్చేసినట్లుగా రాద్ధాంతం చేయటం సరికాదన్నారు.

బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు ఉన్న పేర్లను శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కి బదలాయించిన కాంగ్రెస్‌ పార్టీ.. మార్గమధ్యంలో ఎన్టీఆర్‌ పేరు మర్చిపోయిందని.. వాళ్లు వదిలేసిన పనిని తాము పూర్తి చేశామన్నారు. మొత్తానికి పవర్‌లో ఉన్నప్పుడు చేసిన తప్పుడు పనిని సరి చేయటం కూడా కాంగ్రెస్‌ నేతలకు తప్పుగానే కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు