ఉంటే కనిపించరేం?

ఉంటే కనిపించరేం?

మాజీ మంత్రి కొండా సురేఖ వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీలోనే ఉన్నార్ట. ఆ పార్టీకి చెందిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి కొండా సురేఖ తమ పార్టీలోనే ఉన్నారని చెప్పారు. భూమన ఏం చెప్పినాగానీ కొండా సురేఖ వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీలో కనిపించడంలేదు కొన్నాళ్ళ నుంచి. జగన్‌ కోసమే కొండా సురేఖ మంత్రి పదవి వదులుకున్నారు, ఎమ్మెల్యే పదవినీ కోల్పోయారు. కాని ఆమెకు ఆ పార్టీలో ప్రాధాన్యత దక్కడంలేదు. దానిపై అసహనంతో కొండా సురేఖ మౌనంగా ఉన్నారు.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ చేపట్టే ఏ కార్యక్రమంలోనూ ఆమె పాల్గొనడంలేదు సరికదా, వరంగల్‌ జిల్లాలో పార్టీ కార్యాలయానికి ఆమె తన అనుచరులతో తాళం వేయించారు కూడాను. ఇదేదీ భూమనకు తెలియదా? అంటే తెలియదని కాదుగాని అంతకు మించిన సమాధానమైతే ఆయన వద్ద ఉండి ఉండకపోవచ్చును. కొండా సురేఖ బిజెపిలో చేరాలనుకుంటున్నారని ఓ పుకారు వినిపిస్తున్నది రాజకీయ వర్గాలలో. ఇదెంతవరకు నిజమో చూడాలిక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English