సీఎం కేసీఆర్ పొరపాటు చేశాడా?

సీఎం కేసీఆర్ పొరపాటు చేశాడా?

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పొరపాటు చేసినట్లు తెలుస్తోంది. శాసన సభ నియమాల ప్రకారం అసెంబ్లీ జరుగుతున్న సభలో ప్రభుత్వ నిర్ణయాలన్నీ సభలోనే వెలువరించాలి. కానీ, తెలంగాణ రాష్ట్ర చిహ్నాలను అసెంబ్లీ జరుగుతున్న సమయంలో శాసన సభ వెలుపల వెల్లడించారు. ఇలా ప్రకటిండానికి అవకాశం లేదు. ఈ నిబంధనలను కేసీఆర్ పొరపాటున ఉల్లంఘించినట్లు తెలుస్తోంది.

దీనిని గుర్తించిన బీజేపీ దీనిపై కేసీఆర్ కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇచ్చిన ఈ నోటీసును స్పీకరు మధుసూధనాచారి ఈరోజు పరిగణనలోకి తీసుకున్నారు. "ఇది కేసీఆర్ శాసన సభ నిబంధనల గురించి అవగాహన లేకపోవడం జరిగిన పొరపాటు అయిఉండొచ్చు గాని శాసన సభను నిర్లక్ష్యం చేసే ఉద్దేశాలు కేసీఆర్ కు లేవు. అసలు శాసన సభను అన్ని రాష్ట్రాల కంటే ఆదర్శంగా నిర్వహించాలనే ఆలోచన ఉన్న వ్యక్తి కేసీఆర్'' అని ఒక టీఆర్ఎస్ నేత వ్యాఖ్యానించారు.  

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు