21వేల మంది ఒకటిన్నర నిమిషం పాటు..

21వేల మంది ఒకటిన్నర నిమిషం పాటు..

దేశం కాని దేశంలో.. ఆ దేశానికి ఏ మాత్రం సంబంధం లేని ఒక విదేశీ నేత నిర్వహించిన బహిరంగ సభకు 21వేలమంది (వేదిక ఏర్పాటు చేసిన మొత్తం కెపాసిటీ కూడా 21వేలే) హాజరు కావటం ఒక ఎత్తు అయితే.. తాము ఎంతగానో అభిమానించే నేత కోసం వేలాది మంది వేదిక బయట స్థలంలో ఉండిపోవటం చాలా అరుదుగా జరుగుతుంది.

దీనికితోడు ఆస్ట్రేలియా లాంటి దేశంలో వీక్‌ ఫస్ట్‌డేతో పాటు.. వర్కింగ్‌ డే రోజున అంతమంది ప్రజలు జమ కావటం అంత చిన్న విషయం ఏమీ కాదు. ఎందుకంటే సభకు హాజరైన వారిలో చాలామంది ఉన్నత ఉద్యోగాలు..కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారే. ఇలాంటి ఎన్నో విశేషాలు తాజాగా మోడీ ఏర్పాటు చేసిన సిడ్నీ ఆల్ఫోన్స్‌ ఎరీనాలో చోటు చేసుకున్నాయి.

సభా వేదిక మీదకు వచ్చిన మోడీని.. పేరు పెట్టి 21వేల మంది ఒకేసారి పిలవటం.. జాతీయగీతాలాపన సందర్భంగా ఇరు దేశాల జాతీయ గీతాల్ని ఆలపించారు. ఆస్ట్రేలియా జాతీయ గీతాన్ని.. భారతదేశ జాతీయ గీతాన్ని ఒకేరకమైన భావోద్వేగంతో ఆలపించిన భారతీయులు.. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత దాదాపుగా ఒకటిన్నర నిమిషం పాటు.. భారతదేశ ప్రధానిని.. మోడీ.. మోడీ అంటూ ఒకే అరుపులు కేకలు.

21వేల మంది భారీ సమూహం దాదాపుగా ఒకటిన్నర నిమిషంపాటు హర్షాతిరేకంగా నినాదాలు చేస్తుంటే.. మోడీ వారిని అలా చూస్తుండిపోయారు. తర్వాత ఎలాంటి భావాల్ని ముఖంగా ప్రదర్శించకుండా తన ప్రసంగంలోకి వెళ్లిపోయారు. ఆ సమయంలో రెండు మాటలు మాట్లాడి కొన్ని సెకన్లు ఆగిన వెంటనే.. రాక్‌స్టార్‌ అంటూ పెద్దగా అరవటం.. దానికి ప్రతిగా మళ్లీ మరోసారి హర్షాతిరేకాలు వ్యక్తం కావటం.. చాలా అరుదనే చెప్పాలి. అలాంటిది మోడీకే సాధ్యమనాలి. అందుకేనేమో ఆయన పొలిటికల్‌ రాక్‌ స్టార్‌ అయ్యారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు