'టీ' నేతల జీతాలు పెంచుకున్నారు

'టీ' నేతల జీతాలు పెంచుకున్నారు

ఓ పక్క విద్యుత్తు సంక్షోభం.. మరోపక్క రైతుల ఆత్మహత్యలు.. మరోవైపు నెల నెలా అందాల్సిన వృద్ధాప్య పింఛన్లు ఈ నెలలో ఇప్పటికి అందని వైనం. పరిస్థితులు ఇలా ఉంటే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలకు ఇచ్చే జీతాలపై సానుకూలంగా స్పందించింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవరి బతుకుల్లోనూ మార్పు రానప్పటికీ నేతల నెలసరి జీతాలు పెంచే విషయంలో టీ సర్కారు సానుకూలంగా స్పందించింది. ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీల జీతాలను రూ.2లక్షలకు పెంచాలని భావిస్తోంది.

ఇప్పటికే ఈ అంశంపై టీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సానుకూలంగా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. తాజాగా జీతాల పెంపు నిర్ణయం కారణంగా ఏటా తెలంగాణ ప్రభుత్వంపై రూ.150కోట్ల మేర భారం పడే అవకాశం ఉంది. నేతల జీతాల పెంపుతో పాటు.. మాజీ ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలకు పింఛన్లు ఇవ్వటం.. ఎంపీలకు మెరుగైన అలవెన్స్‌లు లాంటి అంశాలపై కూడా మార్పులు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు