జంపింగుల్లో కింగులెవరు?

జంపింగుల్లో కింగులెవరు?

పార్టీలు మారడమనేది రాజకీయ నాయకుల జన్మహక్కుగా మారిపోయినది. సిద్ధాంతాలనేవాటికి పాతరేసి చాలా తేలికగా పార్టీలు మార్చేస్తున్నారు, పూటకో జెండా చేత పడుతున్నారు. రాజకీయ నాయకులు. ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు అన్నట్టుగా 'జంపింగు కింగులు' గోడలు దూకుతుండగా, ఎవరు ఏ పార్టీకి చెందినవారో తెలుసుకోవడం కష్టమవుతున్నది ఓటర్లకి.

యంగ్‌ జనరేషన్‌గా చెప్పబడే 40 నుంచి 55 ఏళ్ళ లోపు నేతలు ఎలాగోలా రాజకీయాల్లో గోడలు దూకుతూ తమ ఉనికి కాపాడుకుంటారుగాని, 60 పై బడ్డ నేతలు జంపింగుల బాట పడితే వారు రాజకీయాల్లో తమ ఉనికి చాటుకోవడం కష్టతరమవుతుంది. కోటగిరి విద్యాధరరావు పిఆర్‌పిలోకి వెళ్ళారు టిడిపి నుంచి. ఆయన ఇప్పుడు రాజకీయాల్లో ఎక్కడున్నారో ఎవరికీ తెలీదు. పిఆర్‌పిలో చేరిన కొందరు సీనియర్‌ నాయకుల ఆ తర్వాత వేరే పార్టీలోకి వెళ్ళారుగాని, వారి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమైపోయినది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీలోకి వెళుతున్న ఇతర పార్టీలకు చెందిన సీనియర్‌ నేతల్లో వయసు పైబడ్డవారి భవిష్యత్తు కూడా ఇలానే ఉంటుందని ఓ అంచనా.

మైసూరారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, దాడి వీరభద్రరావు ఇలాంటివారు 2014 ఎన్నికల తర్వాత ఏ పొజిషన్‌లో ఉంటారో చెప్పడం ఇప్పుడే కష్టం. పిఆర్‌పితో వైఎస్‌ఆర్‌ కాంగ్రెసును పోల్చడం కాదుగాని కొత్త కొత్త పార్టీల్లో సీనియర్లు నిలదొక్కుకోవడం కష్టమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English