కుక్క కాటుకి కేసుతో కొట్టారు

కుక్క కాటుకి కేసుతో కొట్టారు

కుక్క కాటుకి చెప్పుదెబ్బ అని పెద్దలంటే, పోలీస్‌ కేసుతో కొట్టాలని 'కుక్క కాటుకు గురై పోలీసుల కేసులు' పెట్టినవారు కొత్త భాష్యం చెప్పారు. ఈ జాబితాలో కేసు ఎదుర్కొంటున్నది సినీ నటుడు వేణుమాధవ్‌ కావడంతో కుక్క కాటు - పోలీసు కేసు అన్న అంశానికి ప్రాధాన్యత ఏర్పడినది. వేణుమాధవ్‌ పెంపుడు కుక్క ఒకటి అతని ఇంటి ముందు నుంచి వెళుతున్న ఓ ఇంటర్‌ విద్యార్థిని గట్టిగా కరిచిందట. కుక్క కాటుకు గురైన బాధితుడు ఆసుపత్రి పాలయ్యాడు. అతని కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదయ్యింది.

కుక్కను పెంచుకోవడం స్టేటస్‌ సింబల్‌ కావొచ్చునుగాని, దాన్ని జాగ్రత్తగా గొలుసుతోనో, తాడుతోనో కట్టని పక్షంలో అది ఇతరులపై విరుచుకుపడే ప్రమాదం ఉన్నది. అలా కుక్క తన కాటు బుద్ధి ప్రదర్శిస్తే పోలీసులు కేసులు నమోదు చేస్తారన్న అంశం ప్రచారంలోకి వచ్చింది. కాబట్టి, కుక్కల యజమానులు బహు జాగ్రత్త. లేనిచో కుక్క పెంచడం వల్ల కేసులు, కోర్టులు, ఒక్కోసారి శిక్షలూ ఎదుర్కోవాల్సి రావొచ్చు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు