రోజుకు రూ.5లక్షల ఆదాయం

రోజుకు రూ.5లక్షల ఆదాయం

ఒక రోజులో రూ.5లక్షలు సంపాదించాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలి? ఏ స్థాయిలో వ్యాపారం చేయాలి? ఒక ఆటోడ్రైవర్‌ ఒక రోజులో ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా కేవలం మాటలు.. తనకున్న పరిచయాలతో రూ.5లక్షలు సంపాదించిన పరిస్థితి.

ఏపీ రాజధానిగా ఎంపిక చేసిన తుళ్లూరులో ఇలాంటి సిత్రాలు ఎన్నో కనిపిస్తున్నాయి. ఆటో నడుపుతూ బతుకుబండిని లాగే ఒక వ్యక్తి.. రాజధాని ప్రకటనతో వచ్చి పడిన రియల్‌ బూం పుణ్యమా అని తనకు తెలిసన పరిచయాలు.. అమ్మకానికి సిద్ధంగా ఉన్న భూముల సమాచారంతో.. ఊరికి వచ్చే వారికి వాటిని చూపించి అమ్మే రియల్‌ఎస్టేట్‌ బ్రోకర్‌ అవతారం ఎత్తాడు.

ఒక పక్క ఆటో నడుపుతూనే.. మరోపక్కఈ వ్యవహారాల్ని నడిపాడు. ఇది అతని స్థితిని పూర్తిగా మార్చేసింది. నెల కిందట వరకూ లక్ష రూపాయిల ఆదాయం అన్నది ఆతని జీవిత కోరికగా ఉంటే.. ఇప్పుడు లక్ష అన్నది అతనికి చాలా చిన్న మాటగా వినిపించే పరిస్థితి. ఎందుకంటే.. రియల్‌ వ్యాపారంలో బ్రోకరేజ్‌ చేయటం ద్వారా అతగాడి సంపాదన ఒక రోజులో అక్షరాల రూ.5లక్షలు.

ఇలాంటి ఆటో డ్రైవర్లు.. రైతు కూలీలు.. ట్రాక్టర్లు నడిపేవారు.. ఎద్దుబండి తోలేవారంతా ఇప్పుడు రియల్‌ బ్రోకర్లుగా అవతారం ఎత్తటం.. ఊరికి వచ్చేవారికి అవసరమైన భూమిని కొనుగోలు చేసి పెట్టే విషయంలో చురుగ్గా వ్యవహరించటంతో ఇప్పుడు లక్ష్మీదేవి తుళ్లూరులో తిష్టవేసిందనే చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు