దోపిడీ రాజకీయం

దోపిడీ రాజకీయం

వరుసగా రెండు సార్లు కేంద్రంలో అధికారం కొనసాగిస్తున్న యుపిఏ కూటమి నిలువెల్లా కుంభకోణాలతో కునారిల్లుతున్నది. ఒకదాని వెంట ఒకటి కుంభకోణాలు తరుముతుండగా, కేంద్ర ప్రభుత్వమనే బస్సును నడుపుతున్న కాంగ్రెసు పార్టీ బుకాయింపులతోనే సరిపెడుతున్నది. టూ జి స్పెక్ట్రమ్‌ కేటాయింపుల్లో పెద్దయెత్తున డబ్బు చేతులు మారిందనని ఆరోపణలు రాగా, ఆ కుంభకోణంపై సీరియస్‌గా స్పందిస్తున్నట్లే కనిపించడానికి అప్పటి కేంద్ర మంత్రిని పదవి నుంచి తప్పించడంతోపాటుగా, కొందరిని జైలుకూ పంపారు.

ఆ తరువాత బొగ్గు కుంభకోణం కాంగ్రెసు పార్టీకీ, యుపిఏ ప్రభుత్వానికీ పెద్ద మచ్చ తెచ్చింది. ఆ మచ్చని తుడుచుకుందామని ప్రయత్నిస్తుండగా, అక్కడా ఇక్కడా ఆ కుంభకోణం తాలూకు మచ్చలు అంటుకుంటూ ఇంకా అప్రతిష్ట వచ్చి పడుతున్నది. ఈ కుంభకోణం నుంచి తప్పించుకోవడానికి సిబిఐని బజారుకీడ్చింది కేంద్ర ప్రభుత్వం. రైల్వే శాఖ మంత్రి మేనల్లుడొకరు రైల్వే శాఖలో ఉన్నత పదవి ఇప్పిస్తానని చెప్పి 12 కోట్లకు ఒప్పందం కుదుర్చుకోవడమూ యుపిఏకి చెడ్డపేరు తెచ్చింది.

రోజుకొకటిగా వెలుగు చూస్తున్న ఈ కుంభకోణాలతో ఇప్పటిదాకా నిష్కల్మష వ్యక్తిగా పేరున్న ప్రధాని కుంభకోణాల ఊబిలో కూరుకుపోవాల్సి వస్తున్నది. రాజకీయమంటేనే ప్రజలకు వెగటు పుట్టించేలా ఈ కుంభకోణాలు దేశ ప్రతిష్టతను దిగజార్చుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English