వేటు పడితే ఉప ఎన్నికలేనా?

వేటు పడితే ఉప ఎన్నికలేనా?

సాధారణ ఎన్నికలకు ఏడాది సమయమే ఉంటే ఉప ఎన్నికలు నిర్వహించడానికి అవకాశాలుండవని కేంద్ర ఎన్నికల సంఘం తరఫున ఎలక్షన్‌ కమిషనర్‌ బ్రహ్మ చెప్పారు, ఉప ఎన్నికల గురించి ఆయన వద్ద ప్రస్తావిస్తే. అవిశ్వాస తీర్మానం సందర్భంగా 18 మంది ఎమ్మెల్యేలు (వీరిలో కాంగ్రెస్‌, టిడిపి వారు ఉన్నారు) తమ పార్టీల విప్‌ ధిక్కరించగా, వారిపై స్పీకర్‌కి ఆయా పార్టీలు ఫిర్యాదు చేయడం జరిగింది.

ఆ 18 ఎమ్మెల్యేలకు స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తాజాగా నోటీసులు జారీ చేశారు 13, 14 తేదీలలో తనను కలిసి అనర్హత పిటిషన్లపై సమాధానం చెప్పాలని ఆదేశిస్తూ. స్పీకర్‌ తాజా నిర్ణయంతో అనర్హత వ్యవహారంపై తొందరగా తేల్చాలనే ఆయన ఆలోచన స్పష్టంగా కనిపిస్తున్నదని విశ్లేషకులు అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు. ఒకవేళ 18 మందిపై అనర్హత వేటు పడినట్లయితే ఉప ఎన్నికలు తప్పకపోవచ్చు.

ఉప ఎన్నికలు జరగకపోయినట్లయితే అనర్హత పడ్డవారు ఇంకో ఏడాది పాటు ఎమ్మెల్యే పదవులకు దూరంగా ఉండాల్సి వస్తుంది. 13, 14 తేదీలో రెబల్‌ ఎమ్మెల్యేలు స్పీకర్‌కి ఇచ్చే సమాధానాన్ని బట్టి ఏం జరుగుతందన్నదానిపై ఓ అంచనాకు రావచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English