ఎన్నాళ్లకు గుర్తుకొచ్చిందో

ఎన్నాళ్లకు గుర్తుకొచ్చిందో

విపత్తు ఏదైనా విరుచుకుపడినప్పుడు.. బాధితులకు అందాల్సిన సాయం యుద్ధప్రాతిపదికన అందాల్సి ఉంటుంది. అంతేకానీ.. ఆర్చుకొని.. తీర్చుకొని వారాల  తర్వాత స్పందిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు.

మరి.. ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మాత్రం ఇందుకు భిన్నమనే చెప్పాలి. హుధూద్‌ తుఫాను దెబ్బతో ఉత్తరాంధ్ర తీవ్రంగా నష్టపోవటం తెలిసిందే. ఈ విపత్తు కారణంగా దెబ్బ తిన్న ప్రాంతానికి జరిగిన నష్టాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్‌ జగన్‌కు ఇన్నాళ్లకు తీరికి దొరికింది. దాదాపుగా నెల రోజుల తర్వాత కానీ హుధూద్‌ నష్టం లెక్కలు జగన్‌కు అందుబాటులోకి రాలేదేమో.

హుధూద్‌ కారణంగా జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు అవసరమైన ఆర్థికసాయాన్ని అందించాలని కోరుతూ ఇన్నాళ్లకు జగన్‌బాబు.. కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీని కలవనున్నారు. మరి.. ఇంత ఆలస్యంగా స్పందించిన ఆయన.. కనీసం జరిగిన నష్టానికి సంబంధించిన పక్కా లెక్కలు.. అంచనాలు తీసుకెళుతున్నారా? అంటే సందేహమే. మొక్కుబడి కార్యక్రమాల వల్ల ప్రయోజనం ఉంటుందా జగన్‌?