తిక్కవరపుకు విశాఖ ఖరారే!

తిక్కవరపుకు విశాఖ ఖరారే!

ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు` వచ్చే జనరల్‌ ఎలక్షన్స్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖపట్నం నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎంపీ స్థానానికి పోటీచేస్తానని ఢంకా బజాయించి ప్రకటించి.. పురందేశ్వరి `దగ్గుబాటి కుటుంబంతో సున్నం పెట్టుకున్న తిక్కవరపు సుబ్బరామిరెడ్డికి విశాఖపట్నం స్థానం దాదాపు ఖరారైనట్లే. ‘ఒకటి కావాలంటే ` ఒకటి వదులుకో’ అనే సూత్రం ప్రాతిపదికగా.. తిక్కవరపు ముందు కాంగ్రెస్‌ అధిష్ఠానం ఓ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించి.. మొత్తానికి విశాఖ పట్నం ఎంపీ స్థానం ఇవ్వడానికి సూత్రప్రాయంగా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
విషయం ఏంటంటే.. తిక్కవరపు సుబ్బరామిరెడ్డి కేంద్రంలో మంత్రిపదవి కోసం ఆశపడుతున్న వారి జాబితాలో తాను కూడా ఉన్నారు. సోమవారం విస్తరణ నేపథ్యంలో కొన్ని రోజుల నుంచి ఆయన కూడా ఢల్లీ తన లాబీయింగ్‌ను  ముమ్మరం చేశారు. కేవలం పార్టీ ఆదేశాలను పాటించడానికి పూనుకోవడం వలన తనకు ఇష్టం లేకపోయినా కూడా.. నెల్లూరు లోక్‌సభకు పోటీచేసి కోట్లాది రూపాయలు నష్టపోయానని.. తనకు మంత్రిపదవి కేటాయించాలని ఆయన చాలాకాలంనుంచి సందర్భం వచ్చినప్పుడెల్లా అధిష్ఠానం మీద ఒత్తిడి తెస్తూనే ఉన్నారు.

అయితే నెల్లూరు ఉప ఎన్నికలు తరువాత ఇదివరకటి విస్తరణ సందర్భంగా కూడా ఆయన ఈ డిమాండును మేడం ముందు పెట్టారుగానీ పట్టించుకోలేదు. అదే రీతిగా ఈ సారి కూడా మంత్రి పదవి కోసం పావులు కదిపినట్లు సమాచారం. అయితే ఇదే సమయంలో.. ఈసారి ఎన్నికల వేళకు తనకు విశాఖ టిక్కెట్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ కావాల్సిందేననే విజ్ఞప్తి ఒకటి ఆల్రెడీ మేడం వద్ద పెండిరగ్‌లో ఉంది. దాన్ని సాకుగా చూపించి.. ‘ఆ విజ్ఞప్తిని కన్సిడర్‌ చేస్తాం.. పదవికోసం పట్టుపట్టవద్దు’ అనే మాటతో టీఎస్సార్‌ ముందరికాళ్లకు అధిష్ఠానం బంధాలు వేసినట్లుగా ఢల్లీ వర్గాలు చెబుతున్నాయి.నెటూ ఆయనకు పదవి మాత్రం దక్కలేదు. దాంతో వచ్చే ఎన్నికల్లో విశాఖ స్థానం టీఎస్సార్‌కు ఖరారే అని నాయకులు భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు