అలా చేస్తే సత్తిబాబు సీటు సిరిగిపోద్ది...

అలా చేస్తే సత్తిబాబు సీటు సిరిగిపోద్ది...

పీసీసీ చీఫ్ బొత్స సత్తిబాబు టైం అస్సలు బాగున్నట్లు అనిపించట్ల. ఒకదాని మీద ఒకటిగా విషయాలు ఆయన మీద వచ్చి పడుతున్నాయి. ఓ పక్క పార్టీలో తగ్గుతున్న ప్రాభవం ఆయనకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఇప్పటికే సీఎం కిరణ్ తో తలపడి.. తల బొప్పి కట్టించుకున్న ఆయన.. అధిష్ఠానం దృష్టిలో కావాల్సినంత బ్యాడ్ అయ్యాడు. సీఎం సీటులో కూర్చోవాలని తెగ ముచ్చటపడిన ఆయనకు ఏదీ కలిసి రావటం లేదు. తాజాగా కేంద్రమంత్రి జైరాం రమేష్ వ్యాఖ్యలు ఆయన్నుమరింత కుంగదీస్తున్నాయి. అనంతపురం జిల్లాకు వచ్చిన ఆయన మాట్లాడుతూ.. బెల్ట్ షాపులపై దాడి చేయమంటూ ఆడబడుచులకు ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చి పారేశారు. అంతేకాదు.. మీరు కనుక బెల్ట్ షాపులపై దాడి చేస్తే.. మీ మీద ఎలాంటి కేసులు లేకుండా మేం చూసుకుంటాం అంటూ అభయం కూడా ఇచ్చేశారు. ఆయన ఇంగ్లిష్ లో అన్న మాటల్ని తెలుగులోకి అనువదించి చెప్పారు మంత్రి రఘవీరా.

రాష్ట్రంలో పేరుమోసిన లిక్కర్ సిండికేట్ లీడర్ గా బొత్స సత్తిబాబు రాష్ట్ర ప్రజలకు సుపరిచితుడే. తన వ్యాపారాన్ని దెబ్బ తీసేలా జైరాం వ్యాఖ్యలు చేయటంపై సత్తిబాబు మండిపడుతున్నారట. ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన ఏదో మాట్లాడతాడు.. అంత మాత్రాన రఘువీరా అలా చెప్పేయటమేనా? కాస్త మేనేజ్ చేయొచ్చుగా అని సత్తిబాబు సన్నిహితులు తెగ ఫీలయిపోతున్నారు. అదేంది రఘవీరా.. జైరాం ఏదో ఆవేశంలో అంటే మాత్రం... నువ్వు కూడా అన్నది అన్నట్లు చెప్పేయటమేనా? ఆ సమయంలో సోదరుడు సత్తిబాబు గుర్తుకురాలేదా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు