చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారా?

చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారా?

ప్రజారాజ్యం పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అవుతానని కలలుగన్న చిరంజీవికి, అవి పగటి కలలుగా మారిపోయాయి కాని కాంగ్రెసులో తన పార్టీని కలిపాక, కేంద్రమంత్రి పదవి దక్కినాక అతని వెలుగులు బాగానే కనిపిస్తున్నవి. కేంద్ర మంత్రిగా బాధ్యతగా, సమర్థవంతంగా పనిచేస్తున్న చిరంజీవికి అడ్మినిస్ట్రేషన్‌పై పూర్తి అవగాహన వచ్చిందని చిరంజీవి వల్ల రాష్ట్రంలో మంత్రి పదవి దక్కించుకున్న రామచంద్రయ్యగారు చెప్పడం జరుగుతున్నది.

కాని ఇది కాంగ్రెసులో ముఖ్యమంత్రి వర్గానికి అస్సలు నచ్చడంలేదు. ముఖ్యమంత్రి అభ్యర్థి చిరంజీవి, రధసారధి బొత్స అన్న రామచంద్రయ్య మాటలు, బొత్స వర్గానికి కొంచెం ఉపశమనంగానే ఉన్నాయి. దాంతో కిరణ్‌ వర్గం ఒంటరిగా మారిందని చెప్పవచ్చును.

కాని కాంగ్రెసు పార్టీలో చిరంజీవికి ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ఉన్నదని చెప్పలేం. కాంగ్రెసు నిర్ణయాలు అలా ఉంటాయి మరి. కిరణ్‌ ముఖ్యమంత్రి అవుతారని ఎవరూ ఊహించలేదు. ముఖ్యమంత్రి అవుతారనుకున్నవారికి నిరాశే కలుగుతుంది. కాబట్టి రామచంద్రయ్య చేస్తున్న చిరు జపం ప్రచారం కోసమేనని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English