ఇరుక్కున మంత్రి శైలజానాథ్‌

ఇరుక్కున మంత్రి శైలజానాథ్‌

సమైక్య వాదాన్ని గట్టిగా వినిపించే సీమాంధ్ర నేతల్లో శైలజానాథ్‌ ఒకరు. ముఖ్యమంత్రి వర్గం నేతగా ఇతనికి గుర్తింపు ఉన్నది కాంగ్రెసు పార్టీలో. ఇదే శైలజానాథ్‌పై మనీ లాండరింగ్‌ ఆరోపణలు వచ్చాయి. కోబ్రాపోస్ట్‌ ఈ ఆరోపణలు చేసింది. స్టింగ్‌ ఆపరేషన్‌ ద్వారా మనీలాండరింగ్‌కి శైలజానాథ్‌ పాల్పడ్డారని కోబ్రాపోస్ట్‌ తేల్చింది.

అలాగని కోబ్రాపోస్ట్‌ ఆరోపణలు పూర్తిగా నిజమనడం సమంజసం కాదు, తప్పనీ చెప్పజాలం. ఈ ఆరోపణలపై శైలజానాథ్‌ కంగారుగా స్పందించారు. అది కేవలం తనపై దుష్ప్రచారమేనన్నారాయన. డాక్టర్‌ హరికృష్ణ అనే మిత్రుడికి రిఫరెన్స్‌ ఇవ్వడం మినహా ఈ వివాదంతో తనకు సంబంధం లేదని శైలజానాథ్‌ వివరణ ఇవ్వడం జరిగింది. ఎవరా డాక్టర్‌ హరికృష్ణ, ఆయనకీ శైలజానాథ్‌కీ సంబంధం ఏమిటన్నది కోబ్రా పోస్ట్‌ వెల్లడిస్తే బాగుండేది. వివిధ బ్యాంకులపైనా ఈ మనీ ల్యాండరింగ్‌ ఆరోపణలు వచ్చాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English