విగ్రహం చుట్టూ ఇంతటి రాజకీయమా?

విగ్రహం చుట్టూ ఇంతటి రాజకీయమా?

ప్రముఖ సినీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహం పార్లమెంటు ఆవరణలో ఏర్పాటవుతున్నది. దీని చుట్టూ పెద్ద రాజకీయమే నడుస్తున్నది. పార్లమెంటులో ఎన్టీఆర్‌ విహ్రం కోసం దశాబ్దానికి పైగానే వివాదం నడుస్తుండగా, ఆయన కుమార్తె దగ్గుబాటి పురంధరీశ్వరి చొరవ చూపడంతో విగ్రహావిష్కరణకు ముహూర్తం ఖరారయ్యింది ఎట్టకేలకు. అయితే పేరు ఆమెకి, వెనకాల పెత్తనం కాంగ్రెసు పార్టీది అన్నట్టుగా మారింది.

ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెసు పార్టీ ఎన్టీఆర్‌ విగ్రహం పెట్టడం ద్వారా రాజకీయ లబ్ది పొందాలనే ఆలోచన చేస్తున్నది. ఇది అర్థమయి తెలుగుదేశం అధినేతకు ఏం చేయాలో పాలుపోవడంలేదు. ఆ పార్టీ ఎంపీలు ఢిల్లీ వెళ్ళి స్పీకర్‌ నుంచి చంద్రబాబుకి ఫోన్‌ వచ్చేలా చేయగలిగారు. దాంతో చంద్రబాబు ఆహ్వానం అందలేదన్న మాట పక్కన పెట్టి, ఢిల్లీ వెళ్ళడానికి సిద్ధమవుతున్నార్ట. దగ్గుబాటి పురంధరీశ్వరి ఇప్పటికే చంద్రబాబు ఇంటికి 'ఆహ్వాన పత్రిక' పంపగా దాన్ని ఆయన తిప్పి కొట్టారని ఆమె అంటున్నారు.

ఏదేమైనప్పటికినీ ఇక్కడితో ఈ రాజకీయం కట్టిపెట్టాలి. లేనిచో పార్లమెంటులో విగ్రహం పెట్టిన కారణంగా దక్కే గౌరవమేమోగానీ ఈ రాజకీయంతో అన్నగారికి అవమానమే ఎక్కువ జరిగినట్లవుతుంది.

 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English