వర్మ ఎవరిని అయినా కెలకొచ్చు.. తనని అడక్కూడదట!

ఇతరుల వ్యక్తిగత విషయాల మీద, చావులు, ఇతరత్రా సంచలనాత్మక అంశాల మీద సినిమాలు తీస్తూ సర్వైవ్ అవుతున్నాడు కనుకే… వర్మను ఉద్దేశించి పరాన్నజీవి అనే సినిమా తీస్తున్నారు.

అందరి వ్యక్తిగత జీవితాల్లో తొంగి చూడడానికి, వాటి గురించి సినిమాలు తీయడానికి తనకేదో పేటెంట్ ఉన్నట్టు బిహేవ్ చేసే వర్మ… తన వ్యక్తిగత విషయం గురించి ఒక యాంకర్ అడిగితే మాత్రం… పర్సనల్ విషయాలు అడగొద్దు… సినిమా గురించి మాత్రమే అడగాలి అంటూ మధ్యలో లేచి వెళ్ళిపోయాడు. వర్మ హిపోక్రసీ జనం ట్రోల్ చేస్తున్నారు.

మరి అందరి పర్సనల్స్ ఎందుకు కెలుకుతావ్ అంటూ ట్యాగ్ చేసి మరీ కడిగి పారేస్తున్నారు. గతంలోనూ వర్మ ఇలా హిపోక్రసీ చూపించిన సందర్భాలు కోకొల్లలు. కనీసం విమర్శను కూడా తీసుకోలేని వర్మ రేపు తన మీద తీస్తున్న పరాన్నజీవి చూస్తే ఎలా రియాక్ట్ అవుతాడో?

అవతలి వాళ్లపై రాళ్లు వేసేటపుడు ఎదురు దాడి కూడా జరుగుతుందని గుర్తుంచుకోవాలి. వేరే వాళ్ళని వేలెత్తి చూపిస్తే తనని ఎన్ని వేళ్ళు చూపిస్తాయని లాజిక్ ఈ మేధావికి తెలియనిదా ఏమి?