'టీ' లీడర్లందరినీ సింగపూర్‌ పంపిస్తా

'టీ' లీడర్లందరినీ సింగపూర్‌ పంపిస్తా

సింగపూర్‌ పర్యటన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర ప్రభావం చూపినట్లు ఉంది. ముఖ్యమంత్రిగా తన తొలి విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.ఎంతో ఉద్విగ్నంగా.. ఉద్వేగంగా ఆయన మాటలు ఉన్నాయి.

సింగపూర్‌ పర్యటనతో కేసీఆర్‌ భారీగా స్ఫూర్తి పొందినట్లున్నగా ఉంది. ఆయన మాటలు ఆ విషయాన్ని చెప్పకనే చెప్పేస్తున్నాయి. ప్రతికూల పరిస్థితిని తట్టుకొని ఎలా అభివృద్ధి చెందాలో సింగపూర్‌ నిరూపించిందని చెప్పారు. ఆర్థికాభివృద్ధిలో అగ్రరాజ్యమైన అమెరికా సరసన సింగపూర్‌ నిలిచిందని పేర్కొన్నారు.

''మంచినీటితో సహా ప్రతి వస్తువునుసింగపూర్‌ దిగుమతి చేసుకోవాల్సిందే. అక్కడ అంత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. కానీ.. వారి ప్రభుత్వ విధానాలు అద్భుతంగా ఉంటాయి. ప్రభుత్వ విధానాల్లో ప్రజల భాగస్వామ్యం చాలా చక్కగా ఉంటుంది. భూమి సమస్యను సింగపూర్‌ చాలా తెలివిగా పరిష్కరించింది'' అంటూ సింగపూర్‌ గొప్పతనాన్ని ఆయన వివరించారు.

సింగపూర్‌ నుంచి స్ఫూర్తి పొందిన కేసీఆర్‌.. త్వరలో తెలంగాణ ప్రజాప్రతినిధులందరినీ సింగపూర్‌ పంపాలనే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. అభివృద్ధి విషయంలో మన నేతలకు శిక్షణ ఇవ్వాలని సింగపూర్‌ ప్రధానిని తాను కోరినట్లు వెల్లడించారు. మొత్తానికి సింగపూర్‌ అంటే చంద్రబాబు గుర్తుకు వచ్చే దానికి భిన్నంగా.. ఇకపై సింగపూర్‌ అంటే కేసీఆర్‌ సారు గుర్తుకు వస్తారేమో.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు