ఆ నీచుల్ని ఎలా చంపాలంటే..

ఆ నీచుల్ని ఎలా చంపాలంటే..

మనిషిలో ఉండాల్సిన మానవత్వం పాళ్లు కాస్త అయినా లేని దుర్మార్గుల్ని ఏం చేయాలి? పాముల్ని తీసుకొచ్చి అమ్మాయిల్ని బెదిరించి.. వారిపై అత్యాచారాలు చేసే వారిని ఏం చేయాలి? కబ్జాలు.. సెటిల్‌మెంట్లు సంగతి చెప్పనక్కర్లేదు. ఇన్ని దారుణాలకు ఒడిగట్టే వారిని ఎలా శిక్షిస్తే బాగుంటుంది?

ఇదీ.. హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన ఖాదర్‌ అండ్‌ కో అలియాస్‌ స్నేక్‌ గ్యాంగ్‌పై సామాజిక వెబ్‌సైట్లలో వెల్లువెత్తుతున్న ప్రశ్నలు. త్వరలో పెళ్లి చేసుకోనున్న ఒక జంట కుటుంబసభ్యులతో కలిసి తమ వ్యవసాయక్షేత్రానికి వెళ్లటం.. పెద్దవారు వెళ్లిపోయిన కాసేపటికి.. దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించటమే కాదు.. పాముతో బెదిరించి.. నగ్నంగా తయారు చేసి.. అత్యాచారం చేసే స్నేక్‌ గ్యాంగ్‌కు సంబంధించిన వివరాలు తాజాగా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

సంచలనం సృష్టిస్తున్న ఈ గ్యాంగ్‌ చేసిన వికృత చేష్టలు చాలానే ఉన్నాయి. వీరు ఎన్ని దారుణాలకు పాల్పడ్డారన్న దానికి సంబంధించిన వివరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

దీంతో.. వీరిపై సోషల్‌ నెట్‌వర్క్స్‌లో జోరుగా చర్చ సాగుతోంది. ఇలాంటి మానవత్వం లేని కసాయిలకు విధించాల్సిన ప్రశ్నలు ఎంత తీవ్రంగా ఉన్నాయో.. వాటికి సమాధానాలు కూడా అంతే కఠినంగా ఉన్నాయి. ''ఆ దుర్మార్గుల్ని ఉరి తీయండి'', ''ఆ నీచుల్ని రోడ్డు మీద పడేసి కాల్చి చంపిపారేయాలి'', ''కాదు.. కాదు.. వీళ్లను మామూలుగా చంపకూడదు. సలసలా కాగే నూనెలో వేసి చంపే కుంభిపాకమే వీరికి కరెక్ట్‌'', ''చెన్నై స్నేక్‌ పార్కులో పాముల మధ్య వదిలేయాలి'', ''విష నాగుల చేత కాటేయించి చంపించాలి'', ''యాసిడ్‌ పోసి కాడికి పంపాలి'', ''అసలు ఇలాంటి వారి గురించి మాట్లాడే ముందు వాళ్లు చంపేయాలి. తర్వాతే మాట్లాడాలి'',

ఇలా ఒకరి తర్వాత ఒకరుగా స్పందిస్తున్నారు. జనాగ్రహం మరింత తీవ్రంగా ఉంటే.. మరి.. ఈ దుర్మార్గుల విషయంలో కోర్టు.. చట్టం మరెలా స్పందిస్తుందో చూడాలి. శిక్షలు కఠినగా ఉంటే.. నేరస్తులకు వణుకు వస్తుంది. లేని పక్షంలో చట్టాన్ని వారి చుట్టంగా భావించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు