దోపిడీ గురించి ట్యూషన్‌ చెబుతావా ?

దోపిడీ గురించి ట్యూషన్‌ చెబుతావా ?

''అతి తక్కువ కాలంలో లక్షకోట్లు ఎలా దోచుకోవాలో ట్యూషన్‌ చెబుతావా ? దళితుల భూములు ఎలా ఆక్రమించుకోవచ్చో ట్యూషన్‌ చెబుతావా ? ఆర్థిక నేరాలు ఎలా చేయాలో ట్యూషన్‌ చెబుతావా ? ఏం ట్యూషన్‌ చెబుతావు అని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని ఉద్ధేశించి ప్రశ్నించారు. ట్యూషన్‌ చెబుతాను వినండి అని టీడీపీ సభ్యులను ఉద్ధేశించి జగన్‌ అన్న వాఖ్యల మీద ఆయన స్పందించారు. రుణమాఫీని వ్యతిరేకించిన జగన్‌కు దాని గురించి శాసనసభలో మాట్లాడే అర్హత లేదు. తండ్రి హయాంలో అడ్డగోలుగా సంపాదించిన జగన్‌ అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని విమర్శించారు.

వైఎస్‌ హయాంలో అభివృద్ది చెందింది ప్రజలు కాదని ..ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌ అని మరో టీడీపీ సభ్యుడు కాల్వ శ్రీనివాసులు అన్నారు. జగన్‌ ఆస్తులు తండ్రి హయాంలో లక్షల నుండి లక్షా 44 వేల కోట్లకు పడగలెత్తాయని, కానీ ప్రజలు అధ్భుతంగా అభివృద్ది చెందారని జగన్‌ సభలో అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. తప్పుడు లెక్కలతో జగన్‌ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో విద్యుత్‌ వ్యవస్థను నాశనం చేసింది వైఎస్‌ అని, తమ ప్రభుత్వం అధికారం వచ్చిన కొద్దిరోజుల్లోనే దానిని గాడిలో పెట్టిందని అచ్చెన్నాయుడు అన్నారు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు