ట్యూషన్‌ చెబుతానంటున్న జగన్‌ !

ట్యూషన్‌ చెబుతానంటున్న జగన్‌ !

''ఇప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతగాక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గత ప్రభుత్వాల మీద తప్పులు నెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ వ్యవహారం చూస్తుంటే ఆడలేక మద్దెల ఓడు అన్న సామెత గుర్తుకు వస్తోంది. హామీలు నెరవేర్చలేని చంద్రబాబు 20 ఏళ్లు వెనక్కు వెళ్లి అప్పుడు తాను బాగా చేశానని అంటూ ఆ తరవాత నాశనం చేశారని'' అంటున్నాడని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. దీంతో మీ నుండి నేర్చుకోవాల్సిన అవసరం లేదని టీడీపీ సభ్యులు జగన్‌ విమర్శలు తిప్పికొట్టారు. దీంతో 'ట్యూషన్‌ చెబుతున్నాను నేర్చుకోండి' అంటూ జగన్‌ చురకలు అంటించారు.

గత పదేళ్లలే ఏ విధంగా చూసినా అభివృద్ది బ్రహ్మాండంగా ఉంది. కానీ చంద్రబాబు మాత్రం ఈ పదేళ్లలో అన్యాయం జరిగిపోయిందని, అంతకుముందు తాను బాగా చేశానని అంటున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కుంటిసాకులు వెతుకుతున్నారని జగన్‌ చంద్రబాబు ప్రభుత్వాని విమర్శించారు. బాబు వస్తాడు బంగారం విడిపిస్తాడు అని టీవీలలో, పత్రికల్లో ఊదరగొట్టారు. రుణమాఫీకి సంబంధించి బాబు సంతకంతో కూడిన కరపత్రాలను కార్యకర్తలు ఇళ్లిళ్లూ తిరిగి పంచారు. కోటి మంది రైతులు, 70 లక్షల మంది డ్వాక్రా మహిళలు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఇచ్చిన మాట తప్పడం చంద్రబాబుకు అలవాటుగా మారిపోయిందని జగన్‌ తీవ్రంగా విమర్శించారు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు