నేతల ఆశల మీద చంద్రబాబు నీళ్లు !

నేతల ఆశల మీద చంద్రబాబు నీళ్లు !

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ పదవి అంటే రాజకీయ నాయకులు తమ జీవితంలో ఒక్కసారి అవకాశం దొరికితే చాలు అని అనుకుంటారు. తాజాగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, చైర్మన్‌గా ఉన్న కనుమూరి బాపిరాజును తొలగించడం జరిగిపోయింది. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు ఈ పదవి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తిరుపతి టికెట్‌ దక్కనప్పుడు చంద్రబాబు తనకు హామీ ఇచ్చాడని, ఇక ఈ పదవి నాదేనని మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి అనుకున్నారు. పనిలోపనిగా ఎంపీ, నటుడు మురళీమోహన్‌, గాలి ముద్దుకృష్ణమనాయుడు, ఎంపీ రాయపాటి సాంబశివరావులు ఈ పదవి మీద ఆశలు పెట్టుకున్నారు.

అయితే పాలకమండలిని భర్తీ చేస్తారని నేతలు ఆశగా ఎదురు చూస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ప్రస్తుతానికి టీటీడీకి స్పెసిఫైడ్‌ అథారిటీని నియమించి ఊరుకున్నారు. రెవెన్యూ ముఖ్య కార్యదర్శి జెఎస్‌ శర్మన్‌, ఎండోమెంట్‌ కమీషనర్‌ అనురాధలను ఈ అథారిటీలో నియమించి ఊరుకున్నారు. ఎంతో మంది ఆశావాహులు పదవి మీద ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తుంటే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవడంతో నేతలు ఆవేదనలో మునిగిపోయారు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు