జగన్‌ను చూసి వారి పార్టీ నేతలే సిగ్గు పడుతున్నారట

జగన్‌ను చూసి వారి పార్టీ నేతలే సిగ్గు పడుతున్నారట

గత కొద్దిరోజులుగా రాష్ట్ర అసెంబ్లీ అట్టుడికిపోయేలా చేసిన రాజకీయ హత్యల ఉదంతంలో పదే పదే వినిపించిన పేరు పరిటాల రవి. హత్యా రాజకీయాలపై ఏపీ రాష్ట్ర విపక్ష నేత అసెంబ్లీలో చర్చ జరగాలని పట్టుపట్టటం.. ఆపై వాకౌట్‌ వెళ్లిపోవటం తెలిసిందే.

ఈ సందర్భంగా జగన్‌ వ్యవహారశైలిపై పరిటాల రవి సతీమణి.. సీనియర్‌ ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతకు ఉండాల్సిన ఏ అర్హత జగన్‌కు లేవన్నారు. జగన్‌ తీరు చూసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలే సిగ్గు పడుతున్నారని విమర్వించారు. పరిటాల రవీంద్రను హత్య చేసిన వారు బయట దర్జాగా తిరుగుతున్నారని ఆరోపించారు.

''లక్ష కోట్ల రూపాయిలు దోచుకున్న వ్యక్తి.. ఫ్యాక్షన్‌ను ప్రోత్సహిస్తున్న జగన్‌కు అసెంబ్లీలో కూర్చునే అర్హత లేదు'' అంటూ తీవ్రంగా దుయ్యబట్టారు. అమాయకులైన వారిపై కేసులు పెట్టి అన్యాయంగా జైలుపాలు చేశారని ఆమె విమర్శించారు. మరి.. పరిటాల సునీత వ్యాఖ్యలపై జగన్‌ ఏం స్పందిస్తారో చూడాలి.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు