ప్రకాశం జిల్లాకు చాలానే చేస్తారట

ప్రకాశం జిల్లాకు చాలానే చేస్తారట

ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు రెండు విధానాల్ని పాటిస్తున్నారు. ఒకటి.. విబజన కారణంగా జరిగిన అన్యాయాన్ని వివరించి చెప్పటం.. రెండోది.. తమ ప్రభుత్వం ఏపీని ఏ విధంగా తీర్చి దిద్దుతుందో వివరించటం. ఈ విధానం  కాస్త వర్క్‌వుట్‌ కావటంతో ఇప్పుడు నేతలంతా ఇదే విధానాన్ని ఫాలో అవుతున్నారు.

ప్రకాశం పంతులు 143వ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రయానికి ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు జాతిని అత్యంత అన్యాయంగా విభజించిన వారు.. ముందుకు వచ్చి లెంపలు వేసుకొని తప్పు చేశామని లెంపలు చెప్పే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.

రాజధాని లేక.. మౌలిక సదుపాయాలు లేక.. చివరకు న్యాయస్థానం లేకుండా ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ మారిందని.. నిజానికి 29వ రాష్ట్రంగా ఏర్పడింది తెలంగాణ కాదని.. ఆంధ్రప్రదేశ్‌ అని వెల్లడించారు. ఈ సందర్భంగాఆయన ప్రకాశం జిల్లాకు చాలా వరాల్నే ప్రకటించారు. ప్రభుత్వ సలహాదారు హోదాలో కాకుండా.. పరకాల శ్రీమతి కేంద్రమంత్రి అయిన నేపథ్యంలో ఆయన చెప్పిన మాటలు ప్రకాశం జిల్లా వాసులకు సరికొత్త ఉత్సాహానిస్తున్నాయి.

ఎందుకంటే.. జిల్లాకు ఎయిర్‌పోర్ట్‌తో పాటు.. సీపోర్ట్‌ ఏర్పాటు చేస్తామని.. ప్రకాశం జిల్లాను ఇండస్ట్రీయల్‌ హబ్‌గా మారుస్తామని చెప్పారు. అంతేకాదు.. జిల్లాలో సెంట్రల్‌ ఎడ్యుకేషన్‌ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. మొత్తానికి పరకాల చెప్పిన వాటిలో రెండు మూడు వచ్చినా జిల్లా రూపు రేఖలు మారిపోవటం ఖాయం.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు