కేసీఆర్‌ పాలిట శాపంగా 'పవర్‌'

కేసీఆర్‌  పాలిట శాపంగా 'పవర్‌'

తన వ్యూహాలతో ప్రత్యర్థి పార్టీల్ని చిత్తు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ప్రకృతి విసురుతున్న సవాల్‌కు మాత్రం చేతులెత్తేసే పరిస్థితి. కోట్లాది మందిని తన కనుసన్నలతో కంట్రోల్‌ చేసే వ్యక్తి.. ప్రకృతి విసురుతున్న సవాల్‌తో మాత్రం ఢీలా పడిపోతున్నారు.

కాస్త నమ్మకం ఇచ్చి.. నా వెనుక ఉండండి.. బంగారు తెలంగాణ ఎలా సాధ్యం కాదో అని చెబుతున్న ఆయన.. పెరిగిపోతున్న విద్యుత్‌ కొరతను తగ్గించేందుకు మాత్రం ఏమీ చేయలేకపోతున్నారు. వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పు.. ఎలినో పుణ్యమా అని వర్షాలు లేకపోవటం.. ఎండ తీవ్రత పెరగటంతో విద్యుత్‌ వినియోగం మరింత ఎక్కువైంది.

వాస్తవానికి ఆగస్టు.. సెప్టెంబర్‌ నెలల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటంతో పాటు.. వర్షాల పుణ్యమా అని విద్యుత్‌ వినియోగం తగ్గుతుంది. కానీ.. పరిస్థితి అందుకు భిన్నంగా ఉండటంతో విద్యుత్‌ కోతలు భారీగా పెరుగుతున్నాయి. మరోవైపు పెరుగుతున్న లోటుకు తగ్గట్లే.. డిమాండ్‌ మరింత ఎక్కువ కావటంతో టీఆర్‌ఎస్‌ సర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

ఎంత తీవ్రత ఎక్కువగా ఉండటంతో గృహ వినియోగం భారీగా పెరిగింది. దీనికి తోడు వర్షాలు లేకపోవటంతో పంటలకు అవసరమైన నీటిని బోర్ల సాయంతోనే నడిపిస్తున్నారు. బోర్ల వినియోగానికి విద్యుత్‌ అవసరం కావటంతో లోటు భారీగా పెరుగుతుంది. ఇప్పుడు అనుసరిస్తున్న కోతల పుణ్యమా అని చిన్న.. మధ్య తరహా పరిశ్రమలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి. పెరుగుతన్న విద్యుత్‌ లోటుతో పాటు.. రైతుల్ని ఆదుకునే ప్రయత్నంలో భాగంగా.. పరిశ్రమలకు సరఫరా చేసే విద్యుత్‌ను తగ్గించి రైతులకు విద్యుత్‌ సరఫరా చేస్తామని టీ సర్కారు ప్రకటించటంతో పరిశ్రమల భవితవ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు