ఒకరిని ఒకరనుకున్నామంతే..

ఒకరిని ఒకరనుకున్నామంతే..

తప్పు చేయటం కంటే.. దాన్నించు తప్పించుకోవటమే ముఖ్యం. ఆ విషయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చాలా టాలెంట్‌ ఉందనే చెప్పాలి. తెగబడి ఎన్ని మాటలైనా అంటాం కానీ.. అయ్యో నోరుజారామని మాత్రం చెప్పమంటే చెప్పమనేస్తున్నారు.

ఏపీ అధికారపక్షం నేతల్ని బఫూన్లు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. తాను చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి పశ్చాతాపాన్ని వ్యక్తం చేయటం లేదు. ఒకవేళ ఎవరైనా అడిగినా.. ఊహించని రీతిలో ఎదురుదాడి చేస్తున్నారు. మేమేమీ తప్పు మాట్లాడలేదు. ఆ మాటకు వస్తే బఫూన్లు అనే పదం అన్‌పార్లమెంటరీ ఏమీ కాదు. అలాంటప్పుడు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఏమిటి? అంటూ ప్రశ్నిస్తున్నారు.

తమను నరరూప రాక్షసుడని.. అధికార పక్షం నేతలు వ్యాఖ్యలు చేశారని.. దానితో పోలిస్తే బఫూన్లు అనే మాట అంత తీవ్రమైన పదమేమీ కాదని వ్యాఖ్యానిస్తున్నారు. ''మేం క్షమాపణలు చెప్పాలంటే.. వారు క్షమాపణలు చెప్పాలి. లేని పక్షంలో మేమేమీ చేయలేం'' అంటూ తేల్చేస్తున్నారు. పట్టువిడుపులు లేకుండా పెడసరంగా వ్యవహరించే విపక్ష నేత పుణ్యమా అని ఏపీ అసెంబ్లీలో ప్రతిష్టంభవన కొనసాగటం ఖాయమనే చెప్పాలి.

 

TAGS