మెదక్‌ బరిలో బీజేపీనే

మెదక్‌ బరిలో బీజేపీనే

బలం లేని చోట ఒక అడుగు వెనక్కి తగ్గటానికి మించిన మంచి పని మరొకటి ఉండదు. ఆ విషయంలో తెలంగాణ టీడీపీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే చెప్పాలి. తెలంగాణలో అంతంత మాత్రంగా ఉన్న బలం నేపథ్యంలో.. త్వరలో జరిగే మెదక్‌ ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది.

తెలంగాణలో తమకు పట్టు లేకపోవటం.. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెలరేగిపోతున్న నేపథ్యంలో మెదక్‌ పోరుకు కాస్త దూరంగా ఉంటేనే మంచిదన్న వాదన టీడీపీలో వినిపిస్తుంది. అంతకంటే.. ఆ అవకాశాన్ని తమ మిత్రపక్షమైన బీజేపీకి ఇవ్వటం సముచితమన్న వాదన మాటకు బలం పెరుగుతోంది.

జాతీయ స్థాయిలో మోడీ హవా నడవటంతో పాటు.. తెలంగాణకు ఎయిమ్స్‌ తీసుకురావటంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ విజయవంతమైన నేపథ్యంలో.. మెదక్‌ స్థానంలో తమ అభ్యర్థిని గెలిపించటం ద్వారా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు వీలుంటుందన్న వాదనను వినిపించాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకు తగ్గట్లే ఎన్నికల వ్యూహాన్ని అమలు చేయాలనుకుంటున్నారు. మరి.. మెదక్‌ ఓటర్లు కమలనాథుల కలను సాకారం చేస్తారా? లేదా? అన్నది చూడాలి.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు