సుబ్రతోరాయ్‌కి బ్రూనై గండం !

సుబ్రతోరాయ్‌కి బ్రూనై గండం !

'ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది' అని చెబితే వినడమే గానీ ఇంతవరకు చూసింది లేదు. కానీ ఇన్నాళ్లకు మనకు ఆ అవకాశం లభించింది. సహారా అధినేత సుబ్రతోరాయ్‌కి ఇక కటకటాల బాధ తప్పిందిరా దేవుడా అని అనుకుంటుంటే బ్రూనైలో చెలరేగిన ఆందోళనలు పెద్ద గండంగా పరిణమించాయి. సెబి సుబ్రతోరాయ్‌కి జరిమానా విధించిన నేపథ్యంలో ఆ డబ్బును చెల్లించేందుకు లండన్‌లో సహారా గ్రూపుకు ఉన్న మూడు హోటళ్లను అమ్మకానికి పెట్టాడు సుబ్రతోరాయ్‌.

వాటని మార్కెట్‌ ధరకు 45 శాతం అధిక ధర చెల్లించి కొనుగోలు చేసేందుకు బ్రూనై సుల్తాన్‌ ముందుకు వచ్చాడు. సుప్రీంకోర్టుతో పాటు బ్యాంక్‌ ఆఫ్‌ చైనా కూడా దీనికి ఆమోదం తెలిపింది. అయితే తీరా డబ్బు సర్ధుబాటు చేద్దాం అనుకునే సమయంలో స్వలింగ సంపర్కానికి సంబంధించి సుల్తాన్‌ తీసుకున్న నిర్ణయం మీద బ్రూనైలో ఆందోళనలు జరుగుతున్నాయి. దీంతో సుల్తాన్‌ కాస్తా ఈ డీల్‌ సంగతి పక్కన పెట్టి ఆ ఆందోళనలు ఎలా నియంత్రించాలా ? అని ఆలోచనలో పడ్డారట. సహారా ప్రతినిధులు సుల్తాన్‌ ప్రతినిధులతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా ప్రస్తుతానికి వారు దీని గురించి మాట్లాడడం లేదట. దీంతో మరికొన్నాళ్లు జైలులో పడిగాపులు తప్పవని సుబ్రతోరాయ్‌ తల బాదుకుంటున్నాడట.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు