తాగి లొల్లిపెట్టాడు .. తన్ని సీటుకు కట్టారు

తాగి లొల్లిపెట్టాడు .. తన్ని సీటుకు కట్టారు

విమాన ప్రయాణాలలో ఇటీవల అనేక విపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మెల్‌బోర్న్‌ నుండి ఢిల్లీకి వస్తున్న ఎయిర్‌ ఇండియా విమానంలోకి 27 ఏళ్ల ప్రబుద్దుడు ఫుల్లుగా తాగేసి ఎక్కాడు. విమానంలోని సిబ్బంది మీద పడి నానా రచ్చ చేసి ఇద్దరు ఉద్యోగుల దుస్తులు కూడా చించేశాడు. తోటి ప్రయాణికుల మీద పడి కొరికేందుకు ప్రయత్నించాడు. మొత్తానికి తాళ్లు, వైర్ల సహాయంతో విమాన సిబ్బంది అతగాడిని ఎలాగోలా బంధించారు.

విమానంలోని ఓ సీటుకు కట్టేశారు. ఇతర ప్రయాణికుల భద్రత నేపథ్యంలో విమానాన్ని సింగపూర్‌లో దింపమంటారా ? అని ఢిల్లీలోని ఎయిర్‌ ఇండియా ప్రధాన కార్యాలయాన్ని కోరారు. అయితే విమానం రాక ఆలస్యం అవుతుందని వారు నేరుగా ఢిల్లీకి వచ్చేయమన్నారు. ఏకంగా తాగుబోతును 12 గంటలపాటు సీటుకే కట్టేశారు. ఢిల్లీలో విమానం ఆగిన వెంటనే పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. అతడు సాదాసీదా ప్రయాణికుడు అంటే అదీ కాదు. మంచి ఉన్నత స్థానానికి చెందిన వ్యక్తి అని సమాచారం.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు