కాంగ్రెస్‌ ఓటమికి పవన్‌?కారణమే-చిరు

కాంగ్రెస్‌ ఓటమికి పవన్‌?కారణమే-చిరు

తమ్ముడి పవరేమిటో అన్నయ్యకు లేటుగా తెలిసొచ్చింది. పవన్‌ కళ్యాణ్‌ విషయంలో చిరంజీవికి కాస ఆలస్యంగా జ్ఞానోదయం అయింది. ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్‌ ఓటమికి పవన్‌ కళ్యాణ్‌ కారకుడు కాదంటూ బల్లగుద్ది చెప్పిన చిరు.. ఇప్పుడు మాట మార్చాడు. తన పుట్టిన రోజు నాడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ఓటమిలో పవన్‌ పాత్ర ఉందని ఒప్పుకున్నాడు.

''కళ్యాణ్‌ తక్కువవాడేమీ కాదు. అతడికి విపరీతమైన ప్రజాకర్షణ ఉంది. కాంగ్రెస్‌ ఓటమి విషయంలో పవన్‌ ప్రభావం ఉందనడంలో ఏమాత్రం అవవాస్తవం లేదు'' అని స్పష్టంగా చెప్పేశాడు చిరు. ఐతే పవన్‌ తనకు వ్యతిరేకమని తాను భావించట్లేదని చెప్పాడు చిరు. ''కళ్యాణ్‌ పార్టీ పెట్టడం నాకు సపోర్ట్‌ అనే భావిస్తున్నా. ఎందుకంటే మా ఇద్దరి లక్ష్యం ప్రజలకు సేవ చేయడమే. ఐతే మా ఇద్దరి పార్టీలు వేరు. మార్గాలు వేరైనా మా లక్ష్యం ఒక్కటే. అందుకే పవన్‌ పార్టీ పెట్టినపుడు నేను బాధపడలేదు'' అని చిరు చెప్పాడు.

పవన్‌ను, తనను రాజకీయాలు వేరు చేయలేవని చిరు చెప్పాడు. ''ఒక తల్లి కడుపున పుట్టినవాళ్లం ఎలా దూరమైపోతాం. ఒకే కుటుంబంలో పుట్టి వేర్వేరు పార్టీల్లో ఉన్నవాళ్లు ఎంతమంది లేరు.  పవన్‌ మొన్నీ మధ్యనే వాళ్ల వదినకు ఒంట్లో బాలేదంటే వచ్చి చూశాడు. ఇద్దరం చాలాసేపు మాట్లాడుకున్నాం. మా బంధాన్ని విడదీసే శక్తి రాజకీయాలకు లేదు'' అన్నాడు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు