జార్ఖండ్‌ సీఎంకి 'మోడీ షాక్‌' తప్పలేదు

జార్ఖండ్‌ సీఎంకి 'మోడీ షాక్‌' తప్పలేదు

బీజేపీయేతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. నిన్నమొన్నటివరకూ అధికారపక్ష దిలాసాను ప్రదర్శించిన వారు ఇప్పుడు.. అవమానభారంలో కూరుకుపోతున్నారు. ప్రధానమంత్రి మోడీ మేనియాతో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రుల పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావటం తెలిసింది.

వివిధ అభివృద్ధి కార్యాక్రమాల్లో భాగంగా రాష్ట్ర పర్యటనలు చేస్తున్న ప్రధాని మోడీ.. అయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చేదు అనుభవాన్ని మిగులుస్తున్నారు. మోడీ పాల్గన్న సభల్లో ముఖ్యమంత్రులు మాట్లాడుతుంటే.. సభకు హాజరవుతున్న ప్రజలు మోడీ.. మోడీ అంటూ నినాదాలు చేయటం.. ముఖ్యమంత్రి లాంటి వ్యక్తిని సైతం నాలుగు మాటలు చెప్పనివ్వకుండా చేయటంపై వారు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అప్పటికీ.. ప్రజల ఉత్సాహాన్ని గమనించిన మోడీ.. జార్ఖండ్‌ సీఎం మాట్లాడుతున్న విషయాన్ని గుర్తుకు తెస్తూ..  ప్రశాంతంగా ఉండాలని ప్రజలకు సైగలతో చెప్పినా వారు ఓ పట్టాన మాట వినని పరిస్థితి. దీంతో జార్ఖండ్‌ సీఎం చిన్నబోయారు. ఇలాంటి అనుభవాలు ఇప్పటికే మహరాష్ట్ర.. హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఎదురు కావటం తెలిసిందే. దీంతో.. ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు మోడీపై విరుచుకుపడుతున్నారు. తమ పార్టీ అనుచరులతో మోడీ హడావుడి చేస్తున్నారన్నది వారి ఆరోపణ.

జనం మెచ్చిన నాయకుడికి వస్తున్న ప్రజాదరణను తప్పుగా అర్థం చేసుకుంటే లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందేమో. ఇప్పటికే మోడీ మేనియాతో చిన్నబోతున్న ముఖ్యమంత్రులు.. మోడీని తప్పుపడుతూ ముందుకెళ్లటం ద్వారా మరిన్ని సమస్యలు కొని తెచ్చుకున్నట్లేనని చెప్పాలి.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు