జగన్‌.. విమర్శ కోసమే విమర్శలా!?

జగన్‌.. విమర్శ కోసమే విమర్శలా!?

ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి విమర్శలను చూసి ఆ పార్టీ నేతలే ముక్కున వేలేసుకుంటున్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించకుండా చంద్రబాబును విమర్శించాలనే కోణంలోనే జగన్‌ విమర్శలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు.

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారిన సంగతి తెలిసిందే. సంక్షేమ పథకాలను పక్కనపెడితే జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని గతంలో జగనే ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. కేంద్రంలోనూ ఇదే అభిప్రాయం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనే చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. బడ్జెట్‌ గణాంకాలు చూస్తే ఆంధ్రప్రదేశ్‌ ఎంత దీనస్థితిలో ఉందో కళ్లకు కడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయం పెంచుకోవడానికి ఏం చేయాలి? ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కడానికి ఎటువంటి విధానాలు అనుసరించాలనే విషయంలో నిర్మాణాత్మక సలహా సూచనలు ఇచ్చి రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు సాయపడకుండా విమర్శలు గుప్పించడంపై ఆ పార్టీ నేతల్లోనే అసహనం వ్యక్తమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వాన్ని, చంద్రబాబును ఇరుకున పెట్టడానికే ఆయన పదే పదే రుణ మాఫీ హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారని, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో దానిని చంద్రబాబు అమలు చేయలేరని జగన్‌ గట్టిగా భావిస్తున్నారని అంటున్నారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిద్దామని సూచిస్తున్నారు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు