సీఎం అయినా.. తప్పును ఒప్పుకున్నాడు

సీఎం అయినా.. తప్పును ఒప్పుకున్నాడు

అధికారంలో ఉన్న వారిలో ఎంతోకొంత అహంకారం మామూలే. ఇక.. సీఎం లాంటి స్థాయిలో ఉన్న వారి సంగతి ఎలా ఉంటుంది? కానీ.. ప్రైవేట్‌ లైఫ్‌లో ఎంతటి ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పటికీ.. పబ్లిక్‌ లైఫ్‌లోకి వచ్చేసరికి మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు. తమ నోటి నుంచి ఒక పొరపాటు మాట ఎంత రచ్చ చేస్తుందో బాగా తెలుసు. కానీ.. పొరపాటునో.. గ్రహపాటున గోవా సీఎం మనోహర్‌ పారికర్‌ నోరు జారారు. అయితే.. ఆ వివాదం మరింత పెద్దది కాకముందే.. తన తప్పును తాను తెలుసుకోవటమే కాదు.. తాను సారీ చెబుతున్నానంటూ వివాదాన్ని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.

రాష్ట్రంలో అరెస్ట్‌ అయిన విదేశీయుల గురించి మాట్లాడిన గోవా సీఎం పారికర్‌.. ''నీగ్రో'' అంటూ పదాన్ని వినియోగించారు. దీంతో కొంత రచ్చ జరిగింది. దీనికి చెక్‌ చెప్పేందుకు ఆయన రెఢీ అయిపోయారు. తాను ఉపయోగించిన నీగ్రో పదంపై ఆయన సారీ చెప్పటమే కాదు.. తాను ఉపయోగించిన నీగ్రో పదానికి రెండు అర్థాలు ఉన్నాయని.. అందులో ఒకటి అమెజాన్‌ ప్రవహించే నది పేరుగా చెప్పారు.

ఇన్ని మాటలెందుకు నోరు జారి నందుకు బుద్ధిగా సారీ చెప్పేస్తే పోయేదానికి.. ఆ పదానికి ఎన్ని అర్థాలు ఉన్నాయన్న డీటైల్స్‌ వల్ల రచ్చ మరింత పెరగటమే కానీ.. తగ్గేదేమీ ఉండదు కదా. సీఎం స్థాయి వ్యక్తి సారీ చేసేటప్పుడు ఆ మాత్రం కవరింగ్‌ లేకపోతే ఏం బాగుంటుందంటారా?

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు